Manchu Manoj: మంచు మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన మంచు మనోజ్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. అయితే ఆ తర్వాత మనోజ్ కి సక్సెస్ సినిమాలు లేకపోవడంతో సినిమా అవకాశాలు కూడా తగ్గాయి.
ఇక వ్యక్తిగత కారణాలవల్ల కూడా చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం సాలిడ్ కం బ్యాక్ ఇవ్వటానికి మనోజ్ సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల మనోజ్ మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. లక్ష్మి ప్రసన్న నివాసంలో మనోజ్ మౌనిక వివాహ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సెలబ్రిటీలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
వివాహం తర్వాత మనోజ్ మౌనిక ఇద్దరూ కలిసి మొదట కర్నూలు చేరుకొని ఆ తర్వాత తిరుపతికి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. వివాహం తర్వాత మనోజ్ మౌనిక మొట్టమొదటిసారిగా ఒక టీవీ షోలో పాల్గొన్నారు. వెన్నెల కిషోర్ హోస్ట్గా వ్యవహరిస్తున్న అలా మొదలైంది అనే షోలో మనోజ్ మౌనిక గెస్ట్లుగా పాల్గొన్నారు. తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.ఇక ఈ షోలో మనోజ్ మౌనిక తమ ప్రేమ పెళ్లి వరకు రావడానికి ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి వివరించారు.
ఈ క్రమంలో వెన్నెల కిషోర్ అడిగిన ప్రశ్నలకు మనోజ్ స్పందిస్తూ.. సీతారాములు వనవాసం చేసినట్లు మేము మా ప్రేమ కోసం ఎన్నో ఏళ్ళు దేశాలు తిరుగుతూ వనవాసం చేసాము. ఎన్నో డోర్లు మూస్తారో మూయండి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా కొన్ని రోజులుగా మనోజ్ ,విష్ణు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇలా అన్నదమ్ముల మధ్య గొడవలు జరగటానికి మనోజ్, మౌనిక ప్రేమ వ్యవహారమే కారణం అని కూడా ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మనోజ్, మౌనిక హాజరైన ఈ షో పూర్తి ఎపిసోడ్ ఏప్రిల్ 18వ తేదీ ప్రసారం కానుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…