Niharika: మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగా కుటుంబం నుండి ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన ఏకైక వారసురాలిగా నిహారిక నిలిచిపోయింది. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నిహారిక హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి జొన్నలగడ్డ వెంకట చైతన్యని వివాహం చేసుకుంది.
వివాహం తర్వాత కొంతకాలం అన్యోన్యంగా ఉన్న వీరి దాంపత్యం గురించి అనేక వార్తలు వినిపించాయి. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ దంపతులిద్దరూ ఎప్పటికప్పుడు జంటగా ఉన్న వారి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ జంటగా ఉన్న ఫోటోలను డిలీట్ చేయడమే కాకుండా ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. దీంతో వీరి మధ్య మనస్పర్ధలు తలెత్తి విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై వింటూ నిహారిక నాగచైతన్య కానీ మెగా కుటుంబ సభ్యులు కానీ ఎవరు స్పందించడం లేదు.ఇలా విడాకులు వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో నిహారిక తన కెరీర్ లో ఒక అడుగు ముందుకేసింది.
వివాహం తర్వాత నిర్మాతగా మారిన నిహారిక ఇటీవల కొత్త ఆఫీస్ ప్రారంభించింది. దీంతో సమస్యలకే నిహారిక కూడా విడాకుల తర్వాత తన కెరీర్ మీద ఫోకస్ పెట్టిందని సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా నిహారిక బోల్డ్ ఫొటో షూట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇలా నిహారిక బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయటంతో సమంత లాగే నిహారిక కూడా విడాకుల తర్వాత గ్లామర్ డోస్ పెంచింది బోల్డ్ ఫొటో షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ విడాకులు వార్తలు వస్తున్న తరుణంలో ఇలాంటి ఫోటోషూట్ లో అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…