Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ డిజె టిల్లు సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ హీరో తిరిగి ఈ సినిమాకు సీక్వెల్ సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. అయితే ఈ సినిమా సీక్వెల్ అని ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వివాదాస్పద వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.ముఖ్యంగా ఈ సినిమాలో సిద్దు పక్కన నటించడం కోసం ఏ హీరోయిన్స్ ఒప్పుకోవడం లేదు అందుకు ఆయన వ్యవహార శైలి కారణమంటూ కామెంట్లు వినిపించాయి.
ఇక సిద్ధ జొన్నలగడ్డతో ఉన్న మనస్పర్ధలు కారణంగా డైరెక్టర్ విమల్ కృష్ణ ఈ సినిమా నుంచి తప్పుకొని ఈ సినిమాకు మాలిక్ రామ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారని వార్తలు కూడా వినిపించాయి.ఇలా డీజె టిల్లు స్క్వేర్ సినిమా గురించి ఈ విధమైనటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో సిద్దు జొన్నలగడ్డ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ వార్తలన్నింటికీ క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ తనకు డైరెక్టర్ విమల్ కృష్ణకు ఏ విధమైనటువంటి గొడవలు మనస్పర్ధలు లేవని తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన డైరెక్టర్ విమల్ కి వీడియో కాల్ చేసి తమ మధ్య ఏ విధమైనటువంటి గొడవలు లేవంటూ క్లారిటీ ఇచ్చేశారు.ఇక ప్రస్తుతం ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న మాలిక్ రామ్ తో తాను రిలేషన్ లో ఉన్నానని తెలిపారు.
ఆయన మాతో పాటు మా ఇంట్లో ఉంటారని మాలాగే మాతో పాటు భోజనం చేస్తారని ఇంట్లో తాను నిద్రపోతే నేను దుప్పటి కప్పుతాను. ఇలా డైరెక్టర్లతో నా రిలేషన్షిప్ మైంటైన్ చేస్తుంటానని సిద్ద జొన్నలగడ్డ వెల్లడించారు.ఇక కృష్ణ అండ్ హిస్ లీల షూటింగ్ సమయంలో ఆ డైరెక్టర్ కి తాను ముద్దులు కూడా పెట్టాను అంటూ ఈ సందర్భంగా ఈయన తనకు ఎవరితోనూ మనస్పర్ధలు లేవని తన గురించి వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…