Manchu Manoj: మెగా బ్రదర్ నాగబాబు పై పరోక్షంగా సెటైర్లు వేసిన మంచు మనోజ్…!
Manchu Manoj:మంచు వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు చిత్రాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మంచు మనోజ్ గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీకు దూరంగా ఉంటున్నారు. ఇకపోతే తాజాగా మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ మాట్లాడుతూ పరోక్షంగా మెగాబ్రదర్ నాగబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఈ రెండు కుటుంబాల మధ్య పరస్పర అభిప్రాయ బేధాలు ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోని ఇరు కుటుంబాల మధ్య ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్నారు.ఇకపోతే ఈ పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ ఈ వేదికపై మాట్లాడిన పరోక్షంగా నాగ బాబు పై సెటైర్లు వేశారు.
మా ఎన్నికల గురించి మాట్లాడుతూ మా కుటుంబానికి మద్దతు తెలిపిన వారి పట్ల మరొక వ్యక్తి చాలా దారుణంగా మాట్లాడారని అయినా వాటి గురించి మేము ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపారు. ఇదే విషయాన్ని నాన్న దగ్గర ప్రస్తావిస్తే వాళ్లకు హయ్యర్ పర్పస్ లేదు వదిలేయ్ అని అన్నారు. అది కూడా నిజమే కదా వాళ్లకు ఎలాంటి హయ్యర్ పర్పస్ లేదు అంటూ మాట్లాడారు.
అయితే ఆ వ్యక్తి ఫ్యామిలీలో ఎంతో మంచి వాళ్ళు ఉన్నారు. జనాల కోసం ఏదో ఒకటి చేయాలనే తపన కలిగిన వారు ఉన్నారు. అదేవిధంగా హయ్యర్ పర్పస్ కోసం జీవించే వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఏమీ లేకుండా ఉండిపోయారని మంచు మనోజ్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంచు మనోజ్ కచ్చితంగా మెగాబ్రదర్ నాగబాబు గురించి ఈ వ్యాఖ్యలు చేశారని అర్థమవుతోంది. మరి ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…