Roja: హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్ చెంప చెళ్లుమనిపించిన ఎమ్మెల్యే రోజా…షాక్ లో మిగతా కంటెస్టెంట్ లు!
Roja: రాజకీయ నాయకురాలిగా, హీరోయిన్ గా,జబర్దస్త్ జడ్జిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇక జబర్దస్త్ కార్యక్రమం లో మాత్రమే కాకుండా ఏదైనా పండుగల సమయంలో ప్రత్యేక కార్యక్రమాల్లో కూడా రోజా సందడి చేస్తుంటారు.
ఈ క్రమంలోనే ఈ ఉగాది పండుగ సందర్భంగా ఈ టీవీ వారు అంగరంగ వైభవంగా అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా బుల్లితెర నటీనటులు, జబర్దస్త్ కమెడియన్స్, యాంకర్ సుమ, శ్రీముఖి, రష్మి, ప్రదీప్, జీవిత రాజశేఖర్ దంపతులు, పలువురు సీనియర్ నటీమణులు హాజరై ఎంతో సందడి చేశారు.
ఎప్పటిలాగే ఈ కార్యక్రమంలో జబర్దస్త్ జడ్జి రోజా తనదైన శైలిలో అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా పలు స్కిట్ ల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో రోజా బుల్లెట్ భాస్కర్, హైపర్ ఆది పై చేయి చేసుకోవడంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ షాకయ్యారు.
రోజా ఈ విధంగా వీరి పై చేయి చేసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… బుల్లెట్ భాస్కర్ రోజాతో మాట్లాడుతూ మీరు మాకు ఇవ్వకపోతే అక్కడేం చేస్తారని ప్రశ్నించాడు భాస్కర్. దీంతో గట్టిగా రియాక్ట్ అయిన రోజానువ్వు .. బీప్ గురించి మాట్లాడకు అని అనడంతో, నేను బారాబర్ ఇంతే ఇలాగ మాట్లాడతానని బుల్లెట్ భాస్కర్ నోరు లేపాడు. దీంతో కోపంతో ఊగిపోయిన రోజా ఒక్కసారిగా అతని చెంప పై చెల్లుమనిపించింది.ఈ విధంగా రోజా బుల్లెట్ భాస్కర్ పై చేయి చేసుకోవడంతో అక్కడున్న వారందరూ షాకయ్యారు. ఈ క్రమంలోనే హైపర్ ఆది మధ్యలో ఎంటర్ అయి ఇలా ఒక ఆర్టిస్ట్ పై చేయి చేసుకోవడం ఏం బాగాలేదు మేడం అని చెప్పగా వెంటనే రోజా హైపర్ ఆది చెంప కూడా చెల్లుమనిపించింది.ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పెద్దఎత్తున నెటిజనులు ఈ కార్యక్రమం పై స్పందిస్తూ మరోసారి మమ్మల్ని ఫూల్స్ చేయాలని భావిస్తున్నారా… అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…