Manchu Manoj: మంచు మనోజ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన తన సినిమాలకన్న వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. మంచు మనోజ్ ఇదివరకే ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ పెళ్లి అయిన రెండు సంవత్సరాలకి విడాకులు తీసుకొని విడిపోయారు. అప్పటినుంచి ఒంటరిగా ఉన్నటువంటి భూమా మౌనిక రెడ్డి ప్రేమలో పడ్డారు. ఒక బిడ్డకు జన్మనిచ్చినటువంటి భూమా మౌనిక భర్తకు విడాకులు ఇచ్చి ఈమె కూడా ఒంటరిగా జీవితం గడుపుతున్న సమయంలో మనోజ్ పరిచయం కావడం, ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడంతో పెద్దలను ఒప్పించి వీరిద్దరూ తిరిగి రెండవ వివాహం చేసుకున్నారు.
ఇలా ఈ ఏడాది మొదట్లో వివాహం చేసుకున్నటువంటి మనోజ్ మౌనిక ఈ మధ్యకాలంలో తరచూ పలు కార్యక్రమాలకు అటెండ్ అవుతూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే మౌనికకు ఇదివరకే కొడుకు ఉండడంతో తనే నా బిడ్డ అంటూ తన బాధ్యత కూడా నాదేనని మనోజ్ తెలియచేశారు. అయితే తాజాగా మనోజ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మౌనిక మరోసారి తల్లి కాబోతుందని, మనోజ్ తండ్రి కాబోతున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మనోజ్ కి ఇదివరకే పెళ్లి జరిగినప్పటికీ తన మొదటి భార్యకు పిల్లలు లేరు. పిల్లలంటే ఎంతో అమితమైన ప్రేమ ఉన్నటువంటి మనోజ్ మౌనిక కుమారుడిని తన సొంత కుమారుడిలా భావించారు. అయితే మౌనిక మరోసారి తల్లి కాబోతుందని తెలియడంతో మనోజ్ తండ్రికాబోతున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనగా మారింది. మరి మనోజ్ మౌనిక గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలి అంటే ఈ వార్తలపై మనోజ్ స్పందించాల్సి ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే మనోజ్ వాట్ ది ఫిష్ అనే సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇప్పటివరకు తెలియలేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…