Manchu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కుటుంబం నుంచి ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో మంచు మనోజ్ ఒకరు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో హీరోగా నటించిన అనంతరం గత కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ విధంగా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి మనోజ్ గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు.
మనోజ్ సినిమాల విషయంలో కాకుండా వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన ప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే కొంతకాలం పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి మనోజ్ అనంతరం తనకు విడాకులు ఇచ్చి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఇలా గత కొన్ని సంవత్సరాల నుంచి ఒంటరిగా ఉన్నటువంటి ఈయన భూమా మౌనిక రెడ్డితో రెండవ వివాహానికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి.
అలాగే వీరిద్దరూ కూడా దైవ దర్శనం కోసం కలిసి వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరడమే కాకుండా ఇదే ప్రశ్న మనోజ్ కి కూడా ఎదురైంది. ఈ ప్రశ్నకు మనోజ్ సమాధానం చెబుతూ తన జీవితానికి సంబంధించిన ఈ విషయాన్ని మంచి రోజు చూసుకుని తానే చెబుతాను అంటూ సమాధానం చెప్పారు. ఇక ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే గోనే ప్రకాష్ వీరిద్దరి రిలేషన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
వీరిద్దరూ ముందుగా పెళ్లి చేసుకోవాలని భావించారు అయితే అప్పట్లో భూమా కుటుంబం వీరి పెళ్లికి అడ్డు చెప్పడంతో వీరిద్దరూ వేరే వేరే వ్యక్తులను పెళ్లి చేసుకున్నారని ప్రస్తుతం వీరిద్దరూ వారి భాగస్వాములకు విడాకులు ఇచ్చి సహజీవనం చేస్తున్నారంటూ షాకింగ్ కామెంట్ చేశారు.ఇలా గత కొన్ని సంవత్సరాల నుంచి సహజీవనంలో ఉన్న వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పిన ఈయన మనోజ్ త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి కూడా వస్తున్నారంటూ అసలు విషయం వెల్లడించారు.మనోజ్ తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారని ఈయన చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారంటూ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ ఈ విషయాన్ని తెలియచేయడంతో ఇది కాస్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…