Manchu Manoj: మంచు మనోజ్ మౌనిక రెడ్డి నెల రోజుల క్రితం వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మంచు లక్ష్మీ ప్రసన్న నివాసంలో మనోజ్ మౌనిక వివాహ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సినిమా సెలబ్రిటీలతో పాటు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇప్పటికే మనోజ్ మౌనిక వివాహానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక తాజాగా మంచు మనోజ్ తన పెళ్లి వీడియోని ప్రత్యేకంగా వీడియో సాంగ్ రూపంలో డిజైన్ చేసి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఈ వీడియో హృదయాలను హత్తుకునేలా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా మౌనిక, మనోజ్ తమ ప్రేమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకురావడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఒక ఇంటర్వ్యూలో మనోజ్ వెల్లడించాడు.
ఇక ఇటీవల కుటుంబ సభ్యుల అంగీకారంతో వారి ప్రేమని పెళ్ళి పీటల వరకు తీసుకెళ్లారు. మనోజ్ మౌనిక పెళ్లిలో జరిగిన అద్భుతమైన మూమెంట్స్ కి ప్రత్యేకంగా ఓ పాటని రూపొందించారు. ఏం మనసో అంటూ సాగే ప్రేమ గీతాన్ని తాజాగా సోషల్ మీడియా ద్వారా మనోజ్ అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ వీడియోలో మనోజ్ మౌనిక పెళ్లిలో జరిగిన ప్రతి మూమెంట్ ని అందంగా బంధించారు. హల్ది, మెహందీ, ముహూర్తానికి సంబంధించిన ప్రతి ఘట్టాన్ని కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తూ గడిపిన సన్నివేశాలు ఈ వీడియోలో అందరిని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇదిలా ఉండగా వివాహం తర్వాత మనోజ్ మౌనిక జంటగా మొదటిసారిగా అలా మొదలైంది అనే టీవీ షోలో పాల్గొనబోతున్నారు. తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో కూడా విడుదల అయింది. ఈ షోలో వారి ప్రేమను గెలిపించడానికి వారు పడిన కష్టాల గురించి మనోజ్, మౌనిక వెల్లడించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…