Manchu Mohan Babu: టాలీవుడ్ రెబల్ కృష్ణంరాజు మరణించడంతో సినీ ప్రపంచం ఓ గొప్ప నటుడిని కోల్పోయిందని, ఆయన లేని లోటు ఎవరు పోర్చలేరు అంటూ పలువురు సినీ ప్రముఖులు కృష్ణంరాజు సినిమా పరిశ్రమకు చేసిన సేవలను కొనియాడారు.1966లో చిలుక గోరింక సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన తన తుది శ్వాస వదిలే వరకు సినిమాలలో నటిస్తూ చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు.
ఇలా చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణంరాజు ఆదివారం మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈయన మరణించడంతో మంగళవారం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, మంచు విష్ణు, సి కళ్యాణ్, జీవిత, తమ్మారెడ్డి భరద్వాజ్ వంటి తదితరులు పాల్గొన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మోహన్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.తన ఆత్మీయులు ఎంతోమంది అనంత లోకాలకు వెళ్లిన ఎప్పుడు సంతాప సభలో పాల్గొనలేదని మొదటిసారి ఈ సభలో పాల్గొనడం జరిగింది అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు. ఇక కృష్ణంరాజుతో తనకున్న అనుబంధం గురించి మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు.
నన్ను ఇండస్ట్రీలో నోరారా అరేయ్ అంటూ పిలిచే ఏకైక వ్యక్తి కృష్ణంరాజు గారు. అలాగే తనని మొట్టమొదటిసారి బెంజ్ కార్ ఎక్కించినది కూడా ఈయనే అంటూ మోహన్ బాబు కృష్ణంరాజు గురించి తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. కృష్ణంరాజు గారు ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని సకల దేవతలను కోరుకుంటున్నా అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు కృష్ణంరాజు సంతాపసభలో ఎమోషనల్ అవుతూ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…