Categories: FeaturedMovie News

Manchu Vishnu : తన కుటుంబంపై వస్తున్న ట్రోల్స్ గురించి తీవ్రంగా మండిపడ్డ మంచు విష్ణు… ఇకపై సహించేది లేదు… ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తానని హెచ్చరికలు..!

Manchu Vishnu : గత సంవత్సరం 2021లో జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేయడం, విజయం సాధించడం తెలిసిందే. అయితే ఈ ఎన్నికలు చాలా గొడవలు, మాటల యుద్ధంతో సాగింది. ఈ ‘మా ‘ ఎన్నికల సమయంలో తనపై దారుణంగా ట్రోల్స్ జరిగాయాని మంచు విష్ణు ఆరోపించారు. నన్ను మాత్రమే కాదు మా కుటుంబం మొత్తాన్ని తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు అని చెప్పారు. ఎవరు ఇలా చేస్తున్నారో దానికి సంబంధించి అన్నీ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పుకొచ్చారు.

ఐ పి అడ్రస్సులతో సహా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తా…

ప్రస్తుతం ‘జిన్నా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విష్ణు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ప్రమోషన్లలో పాల్గొన్న విష్ణు, తన కుటుంబంపై వస్తున్న ట్రోల్స్ విషయంపై స్పందించారు. ఒక హీరో తనను తన కుటుంబాన్ని కావాలని టార్గెట్ చేసారని చెప్పారు. ఆ హీరోకి సంబందించిన కంపెనీ నుండి నాపై ట్రోలింగ్ జరుగుతోంది, ఇకపై సహించేది లేదు అని స్పష్టం చేశారు. దీనికి సంబందించిన అన్ని ఆధారాలు, ఐపీ అడ్రస్సులు పోలీసులకి ఇస్తానని తెలియజేసారు.

జూబ్లీహిల్స్ లో ఆ హీరోకి చెందిన కంపెనీ నుండి తనపై ట్రోలింగ్ జరుగుతోందని, దీనికోసం ఏకంగా 21 మంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారని తెలిపారు. వారి ఆఫీస్ అడ్రస్ తోపాటు, వారు వినియోగించే ఐపీ అడ్రస్ వివరాలు నా దగ్గర ఉన్నాయి. త్వరలోనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేస్తాను అని మీడియాతో చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago