Categories: Movie News

నారప్ప నుంచి వెళ్లి వెంకీ ఝలక్ ఇచ్చిన మణిశర్మ..!!

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నారప్ప అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ సినిమాకి ఈ సినిమా రీమేక్ కాగా కొత్తబంగారు లోకం సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా కు దర్శకుడు.. బ్రహ్మోత్సం సినిమా పరాజయం తర్వాత ఏ సినిమా ని ఒప్పుకోలేదు శ్రీకాంత్.. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. ప్రియమణి ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది..

కాగా ఈ సినిమా కు సంబందించిన ఓ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా కు మ్యూజిక్ స్వర బ్రహ్మ మణిశర్మ అందిస్తున్నారు. చాల గ్యాప్ తర్వాత మళ్ళీ సంగీతం అందిస్తుండగా ఈ మ్యూజిక్ పై మంచి అంచనాలు ఉన్నాయి.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్పెషలిస్ట్ అయిన మణిశర్మ ని నారప్ప టీం అవమానించింది అని ఆయన ఫీలవుతున్నారు. నారప్ప సినిమా మ్యూజిక్ విషయంలో నారప్ప టీం మణిశర్మ పేరు వేస్తూ.. తమిళ అసురన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ని యాజిటీజ్ గా వాడెయ్యడంతో.. అందరూ మణిశర్మ అసురన్ ట్యూన్స్ ని కాపీ కొట్టి నారప్పకి ఇచ్చాడని మణిశర్మ ని కామెంట్ చెయ్యడంతో.. బాగా హార్ట్అయ్యారు మణిశర్మ..

ఈ విషయాన్నీ ఓ ఇంటర్వ్యూ లో నారప్ప కి తాను మ్యూజిక్ ఇవ్వలేదని అసురన్ ఒరిజినల్ ట్యూన్స్ నే వాడేసారని తాను ఇచ్చిన మ్యూజిక్ ని పక్కనబెట్టేశారని వివరణ ఇచ్చారు. అయినా ఆ విషయంలో మణిశర్మ బాగా హార్ట్ అయ్యారు. అప్పటినుండి నారప్ప విషయంలో మణిశర్మ అంటీముట్టనట్టుగా ఉండడమే కాదు.. రీసెంట్ గా నా పేరు నారప్ప టైటిల్ లో వెయ్యొద్దు నేను ఈ ప్రాజెక్ట్ నుండి అధికారికంగా తప్పుకుంటున్నాను అని చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.

TD Admin

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago