Categories: FeaturedMovie News

Manoj nandham : అవి అమ్మ ఆఖరి రోజులు.. ఎంత ఖర్చుపెట్టినా అమ్మను దక్కించుకోలేక పోయాను : మనోజ్ నందం

Manoj Nandham : సెలబ్రిటీలు అయినా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. తెరపై నవ్వుతూ కనిపించే సెలబ్రిటీల జీవితాలు నిజ జీవితంలో కూడా అలానే ఉంటాయి అనుకోవడం పొరపాటు. ఎన్నో బాధలు, కష్టాలు ఉన్నా అవకాశన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం తెరపై అవన్నీ వదిలేసి నటిస్తారు. సోషల్ మీడియా వల్ల ఇప్పుడు ప్రతి ఆర్టిస్ట్ ఏదో ఒక ఇంటర్వ్యూ లో తాము పడిన కష్టాలను, ఇబ్బందులను ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు. అలానే మనోజ్ నందం జీవోతంలోని విషదాన్ని ఇంటర్వ్యూ లో షేర్ చేసుకున్నాడు.

అమ్మను బ్రతికించుకోలేక పోయాను…

ఛత్రపతి సినిమాలో ప్రభాస్ నటన మరచిపోలేము, తల్లి కోసం ఆరాటపడే హీరో క్యారెక్టర్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అలాంటి పాత్రలో చిన్నప్పటి ప్రభాస్ పాత్రలో అలరించిన వ్యక్తి మనోజ్ నందం. చిన్నప్పటి పాత్రలో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అతడు వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ హీరోగా సినిమాలు చేసాడు. రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ వంటి సినిమాల్లో నటించినా పెద్దగా ఆ సినిమాలు కెరీర్ కు హెల్ప్ అవలేదు. ఇక మనోజ్ నందం తన కెరీర్ లో చిన్న పాత్రలు కూడా చేస్తూ సినిమాల్లోనే తన కెరీర్ ను నిర్మించుకుంటున్నాడు. ఇక తన వ్యక్తిగత జీవితంలో జరిగిన విషాదాన్ని ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

తన తల్లి 2012 లో క్యాన్సర్ తో హాస్పిటల్ లో చేరగా చాలా నలిగిపోయానని చెప్పారు. తండ్రి వ్యాపారావేత్త ఓ ఎన్ జీసీ కాంట్రాక్టర్, ఆ తరువాత హ్యాండ్ లూమ్ వ్యాపారం కూడా చేసారు. అయినా కూడా తన వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థికంగా నేను ఆధారం అవ్వాలని సినిమాల్లో ఏ అవకాశం వచ్చినా చేసే వాడిని. సహాయ పాత్రలు అంటూ అన్ని చేశాను అందుకే కెరీర్ సరిగా ప్లాన్ చేసుకోలేక పోయాను అంటూ వివరించాడు. అలా 2015 లో తల్లి క్యాన్సర్ తో మరణించినపుడు చాలా క్రుంగిపోయానని చెప్పారు. డబ్బుల్లేక అమ్మను చూసుకోలేకపోయాననే గిల్ట్ అయితే లేదు, కానీ ఎంత డబ్బు ఖర్చుపెట్టినా అమ్మని కాపాడుకోలేకపోయాను అనే గిల్ట్ మాత్రం ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు మనోజ్‌.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago