Featured

R R R : కొమరం భీమ్ గణేశా… వినాయక చవితి పండగకు సిద్ధం…!

R R R : ఈ ఏడాది దర్శకధీరుడు రాజమౌళి తీసిన గొప్ప దృశ్య కావ్యం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. ఇక ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో ఎంతో మంది ప్రేక్షకులకు నచ్చింది ఈ సినిమా. హాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ సినిమాను, రాజమౌళి దర్శకత్వాన్ని పొగుడుతున్నారు. సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు పోషించిన రామ రాజు, కొమరం భీమ్ పాత్రలు అందరినీ బాగా ఆకర్శించాయి. ఇక ఇంటర్వెల్ లో వచ్చే సన్నివేశం అందరినీ కట్టిపడేసింది. భీమ్, పులులు ఇతర జంతువులతో పాటు దూకే సన్నివేశం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక ఆ సన్నివేశంలో ఎన్టీఆర్ ను ఇపుడు గణేష్ విగ్రహం తయారీలో వాడేస్తున్నారు.

కొమరం భీమ్ గణేశా…

శ్రావణ మాసం వచ్చేస్తోంది. అంటే ఇంక పండగల సీజన్ వచ్చేసినట్లే, ఇక మొదట వచ్చే పెద్ద పండగ వినాయక చవితి. అయితే వినాయక చవితి జరుపుకునే విధానం ప్రతి ఏడాది మారిపోతోంది. ఈ మధ్య వినాయక చవితి అంటే డీజే లు, విభిన్నమైన విగ్రహాలు ఎక్కువయ్యాయి. వినాయకుడు కూడా ప్రస్తుత ట్రెండ్ కి అనుగుణంగా మారిపోతున్నాడు భక్తుల వల్ల. ప్రతోడు ఏడాది అప్పుడు జనాలకు బాగా నచ్చిన సినిమాలోని హీరో పాత్రల్తో గణేష్ విగ్రహం తయారుచేస్తుంటారు కళాకారులు.

బాహుబలి సమయంలో ప్రభాస్ శివుడిని మోసినట్లు వినాయకుడు కూడా తన భుజం మీద శివుడిని మోసే విగ్రహాలు వచ్చాయి. ఇక జాతీయనాయకుల రూపంలో ని వినాయకులు ప్రతి ఏడాది కామన్. అలా ఈసారి ఆర్ఆర్ఆర్ మేనియా నడుస్తోంది కాబట్టి ఆ పాత్రల తాలూకు విగ్రహాలు వస్తున్నాయి. జనాలకు బాగా నచ్చినట్టు ఇంటర్వెల్ సన్నివేశంలోని కొమరం బీమ్ పులులతో దిగే చిత్రాన్ని ఇపుడు గణేష్ కి అపాదించి పక్కన పులులు గణేష్ దూకినట్లు విగ్రహాన్ని తయారు చేసారు. అలా ఆర్ఆర్ఆర్ ట్రెండ్ ను గణేష్ విగ్రహాలు తయారు చేసే వాళ్ళు ఫాలో అవుతున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago