Movie News

Singer Mangli : మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి కలకలం! గంజాయి, మద్యం సీజ్ !

Singer Mangli : తెలంగాణ జానపద గీతాలంటే టక్కున గుర్తొచ్చే పేరు సింగర్ మంగ్లీ. బతుకమ్మ పాటల నుంచి బోనాల పాటల వరకు మంగ్లీ గొంతు వినని తెలుగు ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. కేవలం జానపదాలే కాదు, ఎన్నో సినిమాల్లో కూడా తన మధురమైన గాత్రంతో ఎన్నో పాటలకు ప్రాణం పోసింది. ఒకప్పుడు న్యూస్ యాంకర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మంగ్లీ, ఆ తర్వాత ప్రైవేట్ పాటలతో బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా బోనాలు, శివరాత్రి పండుగల సమయంలో ఆమె పాడిన పాటలు ఆమెను ఒక సెన్సేషన్‌గా మార్చేశాయి. ప్రస్తుతం సినిమాల్లో వరుస పాటలు, ఈవెంట్లతో దూసుకుపోతున్న మంగ్లీకి ఊహించని షాక్ తగిలింది.

విషయంలోకి వెళ్తే.. మంగ్లీ తన పుట్టినరోజు వేడుకను చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్‌లో జరుపుకుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, పార్టీలో కొందరు గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అంతేకాదు, అక్కడ విదేశీ మద్యం కూడా లభ్యమైంది. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు త్రిపుర రిసార్ట్ జనరల్ మేనేజర్ శివరామకృష్ణతో పాటు మంగ్లీపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా, అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డీజేను కూడా సీజ్ చేశారు. ఈ బర్త్ డే పార్టీలో సెలబ్రిటీలు దివి, కాసర్ల శ్యామ్ వంటి వారు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

అయితే, పద్ధతిగా కనిపించే మంగ్లీ ఇలాంటి వాటిని ప్రోత్సహించడం ఏమిటని ఆమె అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago