Singer Mangli : తెలంగాణ జానపద గీతాలంటే టక్కున గుర్తొచ్చే పేరు సింగర్ మంగ్లీ. బతుకమ్మ పాటల నుంచి బోనాల పాటల వరకు మంగ్లీ గొంతు వినని తెలుగు ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. కేవలం జానపదాలే కాదు, ఎన్నో సినిమాల్లో కూడా తన మధురమైన గాత్రంతో ఎన్నో పాటలకు ప్రాణం పోసింది. ఒకప్పుడు న్యూస్ యాంకర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మంగ్లీ, ఆ తర్వాత ప్రైవేట్ పాటలతో బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా బోనాలు, శివరాత్రి పండుగల సమయంలో ఆమె పాడిన పాటలు ఆమెను ఒక సెన్సేషన్‌గా మార్చేశాయి. ప్రస్తుతం సినిమాల్లో వరుస పాటలు, ఈవెంట్లతో దూసుకుపోతున్న మంగ్లీకి ఊహించని షాక్ తగిలింది.

విషయంలోకి వెళ్తే.. మంగ్లీ తన పుట్టినరోజు వేడుకను చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్‌లో జరుపుకుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, పార్టీలో కొందరు గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అంతేకాదు, అక్కడ విదేశీ మద్యం కూడా లభ్యమైంది. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు త్రిపుర రిసార్ట్ జనరల్ మేనేజర్ శివరామకృష్ణతో పాటు మంగ్లీపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా, అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డీజేను కూడా సీజ్ చేశారు. ఈ బర్త్ డే పార్టీలో సెలబ్రిటీలు దివి, కాసర్ల శ్యామ్ వంటి వారు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అయితే, పద్ధతిగా కనిపించే మంగ్లీ ఇలాంటి వాటిని ప్రోత్సహించడం ఏమిటని ఆమె అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Singer Mangli Birthday Party | మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి కలకలం! గంజాయి, మద్యం సీజ్ !#SingerMangli pic.twitter.com/asgDDXH5j7
— TeluguDesk (@telugudesk) June 11, 2025




























