Matarani Mounamidi : రుద్ర పిక్చర్స్ పతాకంపై మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి హీరో హీరోయిన్ గా సుకు పూర్వాజ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం “మాటరాని మౌనమిది”. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ తో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే చిత్రం లో పని చేసిన నటీ నటులు టెక్నిషన్స్ అందరూ కలిసి “మాటరాని మౌనమిది” ఫస్ట్ కాపీ ని రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో వీక్షించారు. చిత్రం చూసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా ఉంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది అని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిత్రం లో ఇంట్రవెల్ బ్యాంగ్, సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మరియు క్లైమాక్స్ అద్భుతంగా ఉంది అని కొనియాడారు. హీరో హీరోయిన్ గా నటించిన నూతన నటీనటులు అందరూ దర్శకుడిని కొనియాడారు.
ఈ సందర్భంగా దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ “ఇది నా రెండో సినిమా. మంచి థ్రిల్లర్ ప్రేమ కథ, కథనం తో చిత్రాన్ని నిర్మించాము. ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. మా టీం అందరం కలసి సినిమా ని వీక్షించాము. సినిమా చాలా బాగా వచ్చింది. మా టీం అందరం చాలా నమ్మకంగా ఉన్నాం, సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తా” అని తెలిపారు.
బ్యానర్ : రుద్ర పిక్చర్స్
సినిమా పేరు : మాటరాని మౌనమిది
నటీ నటులు : మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి, సంజీవ్, అర్చన అనంత్, కేశవ్, కాశి, ప్రమోద్, చందు సుమన్ శెట్టి, తదితరులు
కెమెరా మాన్ : శివరామ్ చరణ్
సంగీతం : అషీర్ లుక్
ఎడిటర్ : శివ సర్వాణి
కథ, కధనం, దర్శకత్వం : సుకు పూర్వాజ్
నిర్మాత : రుద్ర పిక్చర్స్
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…