Featured

వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ హీరో కూతురు?

సినీ ఇండస్ట్రీకి చాలా వరకు వారసులే పరిచయమయ్యారు. ఇప్పటికే ఎంతోమంది నటీనటుల కూతుర్లు, కుమారులు పరిచయం కాగా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారు. పలువురు స్టార్ హీరోల కూతుర్లు పరిచయం కాగా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలువలేక పోయారు. అందులో మంచు లక్ష్మి, ఘట్టమనేని మంజుల, నిహారిక కొణిదెల ఎక్కువ అవకాశాలు అందుకోలేకపోగా.. మరికొంతమంది వారసురాలు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో స్టార్ హీరో కూతురు వెండితెరకు పరిచయం కానుంది.

ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్. ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్ని సినిమాలలో నెగటివ్ పాత్రల్లో కూడా నటించాడు. ఇక ఈయన భార్య ఊహ కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. వీరికి ఒక కూతురు ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఇప్పటికే శ్రీకాంత్ తన పెద్ద కొడుకు రోషన్ ను వెండితెరకు పరిచయం చేశాడు. నిర్మలా కాన్వెంట్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు రోషన్. ఇక ప్రస్తుతం రాఘవేంద్ర దర్శకత్వంలో పెళ్లి సందD సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉంది. ఇక త్వరలోనే శ్రీకాంత్ తన కూతురు మేధా ను వెండితెరకు పరిచయం చేయనున్నాడు.

ఇదివరకే మేధ.. అనుష్క నటించిన పాన్ ఇండియా మూవీ రుద్రమదేవి సినిమాలో బాల నటిగా పరిచయమైంది. ఇందులో మేధ రుద్రమదేవి చిన్నప్పటి పాత్రలో నటించగా తన నటనకు మంచి సక్సెస్ అందుకుంది. త్వరలోనే హీరోయిన్ గా పరిచయం కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే తను భరతనాట్య నృత్యకారిణి గా శిక్షణ తీసుకుంది. ఇక తన చదువులు పూర్తయిన వెంటనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనుంది. శ్రీకాంత్ కూడా తన కూతురును పరిచయం చేయడానికి మంచి దర్శకుడు కోసం ప్రొడక్షన్ హౌస్ కోసం ఉన్నట్లు తెలిసింది. ఇక ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ హీరోయిన్ గా అడుగు పెడితే మాత్రం మంచి సక్సెస్ అందుకుంటుదనే అనిపిస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago