Featured

సౌందర్య ఆ ఒక్క కారణంతో ఏ సినిమాలో కూడా అందాల ప్రదర్శన చేయలేదు..!!

సహజత్వం ఉట్టిపడేలా నటించే అతి కొద్దిమంది హీరోయిన్స్ లలో సౌందర్య ఒకరు. తెలుగు సినీ ప్రేక్షకులు సౌందర్యను తెలుగు ఆడపడుచుల చూసుకున్నారు. తన నటనతో మహా‌ నటీమణులను మైమరిపించే ప్రయత్నం చేసిన సౌందర్య దాదాపుగా ఆ స్థానాన్ని చేరుకుందనే చెప్పాలి. పుష్కర కాలం పాటు సినీ పరిశ్రమలో వెలుగొందిన సౌందర్య అనతి కాలంలోనే అందరినీ విడిచి వెళ్ళిపోయింది.
కర్ణాటక, అష్టాగ్రామంలో జన్మించిన సౌందర్య, తల్లిదండ్రుల కోరిక మేరకు కు ఎంబిబిఎస్ చేయాలనుకున్నారు. ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలోనే ఆమెకు తన తండ్రి స్నేహితుడి ద్వారా “గంధర్వ” అనే సినిమాలో నటించారు. తన తల్లిదండ్రులు సౌమ్య అనే పేరు పెట్టారు. కానీ అనుకోకుండా సినిమాల్లోకి రావడంతో సౌమ్య కాస్త సౌందర్య గా మారింది.

1993 దశరథరాజు నిర్మాతగా, రామచంద్రరావు దర్శకత్వంలో “మనవరాలి పెళ్లి” చిత్రం విడుదలయ్యింది. ఈ చిత్రంలో హరీష్, సౌందర్య హీరో, హీరోయిన్లుగా నటించారు. తెలుగులో సౌందర్యకు మనవరాలి పెళ్లి మొదటి సినిమాగా పేర్కొనవచ్చు. ఇక అక్కడి నుంచి ప్రారంభమైన ఆమె తెలుగు సినీ ప్రస్థానం 2004 వరకు సౌందర్య వెనుతిరిగి చూడలేదు. తెలుగులో మాయలోడు రాజేంద్రుడు-గజేంద్రుడు, నెంబర్ వన్, అమ్మోరు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, రాజా, రిక్షావోడు, అన్నయ్య, చూడాలని ఉంది, అంతపురం, లాంటి చిత్రాల్లో సౌందర్య నటించారు.

హిందీలో అమితాబ్ బచ్చన్ తో “సూర్యవంశ్” చిత్రంలో ఆయన సరసన హీరోయిన్ గా నటించింది. అమ్మోరు, అంతపురం, రాజా సినిమాలకి మూడు నంది అవార్డులు సౌందర్య పొందారు. కన్నడంలో గిరీష్ కాసరవెల్లి దర్శకత్వంలో “ద్వీప” అనే చిత్రాన్ని ఆమె నిర్మించారు. 2004లో వచ్చిన లోక్ సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున కరీంనగర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థి విద్యాసాగర్ తరపున ప్రచారానికి వస్తున్న సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.

అయితే ఆమని ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో తనకు సౌందర్యకు మంచి స్నేహం ఉండేదని.. ఓ సందర్భంలో సినిమాలలో ఎందుకు ఎక్స్పోజింగ్ చేయవు అన్న ప్రశ్నకు.. సౌందర్య సమాధానమిస్తూ.. ఇప్పుడు సినిమాల్లో ఎక్స్పోజింగ్ చేస్తే రేపు తనను పెళ్లి చేసుకున్న భర్తకు ఏమని సమాధానం చెప్పాలి అనడంతో తను ‌మౌనంగా ఉండి పోయానని.. ఆ ఇంటర్వ్యూలో ఆమని చెప్పుకొచ్చారు. తిరిగిరాని లోకాలకు వెళ్ళినా సౌందర్య స్థానాన్ని మరెవరూ పూరించ లేకపోయారన్నది సినీ పరిశ్రమ ఎరిగిన సత్యం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago