కొన్ని ఘటనలు కొంతమంది జీవితాలను పూర్తిగా మార్చేస్తాయి. అలాంటిదే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఎదురైంది. పెద్ద కుర్మపల్లికి చెందిన మల్లికార్జున్ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. తన స్నేహితుడు కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్ తో చనిపోయాడు. దీంతో అతడు చాలా బాధపడ్డాడు. ఎందుకు ఇలా జరిగింది.. వాళ్ల రిలేటివ్స్ కు సంబంధించి ఎవరికైనా ఇలాంటి ఉన్నాయా అనేది ఆరా తీశాడు.. కానీ ఎవరకీ అలాంటి వ్యాధులు లేవని తెలుసుకున్నాడు.
చివరకు అతడు క్యాన్సర్ తో చనిపోవడానికి కారణంగా కెమికల్స్ తో కూడిన కూరగాయాలు, ఆకుకూరల పదర్ధాలు తినడమే కారణమని తెలుసుకున్నాడు. దీంతో ఆలోచనలో పడ్డాడు. చివరకు తన సాఫ్ట్ వేర్ జాబ్ వదిలిపెట్టి ఎలాంటి హానికరమైన కెమికల్స్ వాడకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఇందుకు తన భార్య కూడా సహాయం అందించడంతో దాదాపు 13 ఎకరాల్లో.. 26 రకాల , కూరగాయలు, ఔషధ మొక్కలు పెంచుతున్నారు. మల్లికార్జున్ ప్రయత్నానికి ఇండియన్ కౌన్సిల్ అఫ్ అగ్రికల్చర్ రీసర్చ్ అవార్డును గెలుచుకున్నారు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి రైతుగా మల్లికార్జున్ నిలిచారు. అంతేకాకుండా సేంద్రియ పద్ధతుల్లో కొత్త పద్ధతులను కూడా ప్రేవశపెట్టాడు.
ఇలా దాదాపు అతడు సంవత్సరానికి రూ.16 లక్షల వరకు ఆదాయాన్ని చూపిస్తున్నాడు. దీనిపై అతడు స్పందిస్తూ.. తాము భవిష్యత్ తరాల వారికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అదించాలని అనుకున్నాను.. ఆ దిశగానే అడుగులు వేశాను అంటూ చెప్పాడు. ఇలా ఎన్నో రకాల వ్యవసాయ పద్ధతుల ద్వారా నూతన ఒరవడిని స్పష్టించి.. మిగతా రైతులకు ఆదర్శంగా నిలిచాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…