Medico Preethi incident : కాకతీయ యూనివర్సిటీలో పీజీ చేస్తున్న డాక్టర్ ప్రీతి అనే యువతి బుధవారం డ్యూటీ లో ఉండగానే హానికర ఇంజక్షన్ ను వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వరంగల్ లో మెడిసిన్ అనస్థిషియా పీజీ చదువుతున్న డాక్టర్ ప్రీతి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులను భరించలేక ఇలా చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బుధవారం నాడు ప్రీతి ఆత్మహత్యాయత్నం చేయగా గురువారం నాడు పీజీ రెండో సంవత్సరం చదువుతున్న సైఫ్ ను వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత్తు ఇచ్చే డిపార్ట్మెంట్ లో డ్యూటీ నిర్వహిస్తున్న ప్రీతి అక్కడే ఉన్న ప్రమాదకర ఇంజక్షన్ ను వేసుకుంది. ప్రస్తుతం ప్రీతి ఆరోగ్యం క్రిటికల్ గా ఉండటంతో అసలు ప్రీతి ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసుకోవాలనుకుంది అనేది తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.
ఆత్మహత్య కాదు మర్డర్…
ప్రీతి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందంటూ వైద్యులు మీడియకు తెలిపారు. సీనియర్ విద్యార్థి ర్యాగింగ్ శృతి మించడంతో ప్రీతి ఆత్మహత్యాయత్నంకి పాల్పడింది. అయితే ప్రీతి తండ్రి మాత్రం కాలేజీ యాజమన్యం సరిగా స్పందించుంటే ఇలా జరిగేది కాదని, మా అమ్మాయి సెన్సిటివ్ అమ్మాయి కాదని తనను ఎంత వేదించి ఉంటే ఇలా ప్రాణం మీదకి తెచ్చుకుంటుంది తనది ఆత్మహత్య కాదు హత్య అంటూ ఆరోపించారు.
కాలేజీ హెచ్ఓడి నాగార్జున రెడ్డి సరిగా పట్టించుకోలేదని, నా కూతురు ఫిర్యాదు చేసినా సీనియర్ విద్యార్థి సైఫ్ ను మందలించి వదిలేసాడని, ఆరోజు రాత్రే పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా వాళ్ళు పట్టించుకోలేదని ఎవరూ ఏమి చర్యలు తీసుకోకపోవడంతో నా కూతురు ఇలాంటి పని చేసిందని, తన పరిస్థితి విషమంగా ఉందని తెలిసినా ఇంకా ఎక్కడో బ్రతుకుతుందనే నమ్మకంతో ఉన్నామని బాధపడ్డారు. నాగార్జున రెడ్డి తక్కువ కులం వాళ్ళం కాబట్టి మా అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోలేదని ఇంతకు ముందు కూడా ఈయన హయాంలో ఇలా ఇంజక్షన్ ఇచ్చి చంపిన ఘటన ఉందంటూ ప్రీతి తండ్రి ఆరోపించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…