Meena : తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ అంటూ అన్ని భాషలలోనూ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని అందరు టాప్ హీరోస్ సరసన సినిమాలు చేసింది. దక్షిణాదిన టాప్ హీరోయిన్ గా ఎదిగిన మీనా తొలుత చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినిమా ప్రయాణం మొదలుపెట్టింది. ఇక మీనా హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలోనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్ ను పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి అయ్యాక సినిమాలకు దూరంగా ఉన్న మీనా పాప నైనిక పుట్టాక మళ్ళీ భర్త ప్రోత్సాహంతో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్ళీ బిజీ అయింది.
భర్త మరణంతో సంచలనం నిర్ణయం…
ఇక మళ్ళీ మంచి పాత్రలు చేస్తూ తనను తాను ప్రతి సినిమాకు నిరూపించుకుంటూ వచ్చిన మీనా తన కూతురు నైనికను కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటింపజేసింది. జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో మీనా కుటుంబం కరోనా భారిన పడటం, ఇక కరోనా నుండి కోలుకున్నాక విద్యాసాగర్ గారికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎక్కువవడం దానికి తోడు పావురాల వల్ల మరింత ఇన్ఫెక్షన్ రావడంతో లంగ్స్ పూర్తి గా పాడై పోయాయి. ఊపిరి తిత్తుల మార్పిడి చేయాలనుకున్నా డోనర్ దొరక్కపోవడంతో మందుల ద్వారా చికిత్స చేస్తూ వచ్చారు డాక్టర్లు. కానీ అనుకోకుండా విద్యాసాగర్ గారు కన్నుమూశారు. ఇక ఆయన మరణం తో కుంగిపోయి ఉన్న మీనా ఇక సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట.
ఇన్నిరోజులూ తాను షూటింగ్స్ లో బిజీగా ఉంటే తన భర్త తన కూతురుని చూసుకున్నారు, ఇక పై నైనిక కు తన తండ్రి లేని లోటు తెలియకుండా చూసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాల్లో మళ్ళీ బిజీ అయితే బాధని త్వరగా మర్చిపోతావని చాలా మంది సినిమాల్లో నటించమని సలహా ఇస్తున్నారట. మరి మీనా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇప్పటికి ఒప్పుకున్న ప్రాజెక్ట్లను పూర్తి చేసి సినిమాలను మానేస్తారా లేదా అన్నది తెలియాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…