Meena husband death : సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మరణించారు. కరోనా సమయంలో ఎంతో మంది చనిపోతే, ఇక కరోనా తరువాత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ ఇతర కారణాల వల్ల చాలా మంది మరణిస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ లో వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు. కరోనా కారణంగా చాలా మంది మరణిస్తే ఇక కరోనా దుష్ఫలితాల వల్ల చాలా మంది మరణిస్తున్నారు. మీనా భర్త కూడా ఇలానే మరణించారు.
పావురాల వల్ల ఇన్ఫెక్షన్..?
కోవిడ్ తరువాత చాలా మందికి ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ సమస్యగా మారింది. మీనా కుటుంబానికి కరోనా సోకడం ఆ తరువాత దాని నుండి కోలుకున్నా, విద్యా సాగర్ గారు ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడ్డారు. ఇక దీనికి తోడు వాళ్ళ ఇంటికి దగ్గర పావురాలు ఎక్కువగా ఉండటం వల్ల వాటి నుండి వచ్చిన చెడు గాలి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ను మరింత ఎక్కువ చేసిందనే వార్తలు తమిళ మీడియాలో వినిపిస్తున్నాయి.
కొన్ని రోజులుగా ఆయన చికిత్స కోసం ఎంజీఆర్ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఊపిరి తిత్తులు బాగా పాడైపోవడంతో ఊపిరి తిత్తుల మార్పిడి కోసం ప్రయత్నించినా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుండి ఊపిరితిత్తులను సేకరించవలసి రావడంతో డోనర్ దొరకలేదు. ఇక డాక్టర్లు మందులతోనే చికిత్స చేస్తూ వచ్చారు కానీ విద్యాసాగర్ గారు జూన్ 28 న తుది శ్వాస వదిలారు. మీనా కుటుంబానికి సినిమా ఇండస్ట్రీ సంతాపం ప్రకటించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…