Featured

Samantha: బాలీవుడ్ హీరోతో మరో స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత.. ఇక రచ్చ రచ్చే?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నటువంటి సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.విడాకులు తీసుకున్న తర్వాత ఈమె ఏకంగా ఐటమ్ సాంగ్స్ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇలా వరుస సినిమాలు, స్పెషల్ పాటలతో సమంత ఓ రేంజ్లో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇకపోతే సమంత ఇదివరకే పుష్ప సినిమాల్లోని ఉఅంటావా మామ అనే పాట ద్వారా ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Samantha: బాలీవుడ్ హీరోతో మరో స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత.. ఇక రచ్చ రచ్చే?

ఈ పాటతో ఈమె పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఇలా ఐటమ్ సాంగ్ ద్వారా తన అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తో అందరిని సందడి చేసిన సమంత తాజాగా మరొక స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పెద్దఎత్తున వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈసారి ఏకంగా ఈమె బాలీవుడ్ హీరో తో సందడి చేయనున్నట్లు సమాచారం.

Samantha: బాలీవుడ్ హీరోతో మరో స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత.. ఇక రచ్చ రచ్చే?

అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం యానిమల్. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండాలని డైరెక్టర్ ప్లాన్ చేసినట్లు సమాచారం.ఈ పాట హిందీలో మాత్రమే కాకుండా సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని డైరెక్టర్ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

పూజ స్థానంలో సమంత…

ఇకపోతే ఈ పాటలో ముందుగా నటించడానికి పూజా హెగ్డేని అనుకున్నారు. అయితే సమంత పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకోవడంతో యానిమల్ చిత్రంలో కూడా సమంత అయితే బాగుంటుందనే ఉద్దేశంతో డైరెక్టర్ సమంత సంప్రదించినట్లు సమాచారం.ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలబడాలి. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె యశోదా ఖుషి సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago