Featured

ActressMeena : ప్రముఖ నటి మీనా ఇంట తీవ్ర విషాదం.. పోస్ట్ కోవిడ్ సమస్యలతో భర్త మృతి..!

Actress Meena: ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్ తాజాగా హఠాన్మరణం చెందారు. కరోనా బారినపడ్డ విద్యాసాగర్ గత కొంతకాలంగా పోస్ట్ కోవిడ్ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొంత సమయం క్రితమే కన్నుమూశారు.

ActressMeena : ప్రముఖ నటి మీనా ఇంట తీవ్ర విషాదం.. పోస్ట్ కోవిడ్ సమస్యలతో భర్త మృతి..!

ఈ వార్త ఇటు తెలుగు, అటు తమిళ ఇండస్ట్రీ లో తీవ్ర విషాదం నింపింది. తెలుగు, తమిళ భాషలలో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి ఒక వెలుగు వెలిగిన మీన 2009 లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్ ని వివాహం చేసుకుంది. అప్పటినుండి వీరిద్దరూ ఏంతో అన్యోన్యంగా జీవితం సాగిస్తున్నారు . వీరికి నైనిక ఒక పాప కూడా ఉంది.

ActressMeena : ప్రముఖ నటి మీనా ఇంట తీవ్ర విషాదం.. పోస్ట్ కోవిడ్ సమస్యలతో భర్త మృతి..!

ఇదిలా ఉండగా మీనా భర్త విద్యాసాగర్ గత కొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. అంతే కాకుండా ఈ ఏడాది జనవరిలో మీనా కుటుంబం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుంది. ఆ సమయంలో సరైన చికిత్స తీసుకొని అందరూ కరోనా నుండి బయటపడ్డారు. కానీ విద్యాసాగర్ మాత్రం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న విద్యాసాగర్ కి కరోనా వచ్చిన తర్వాత ఊపిరితిత్తుల పనితీరు మరింత క్షీణించింది. ఈ క్రమంలో ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అధికం అయ్యింది.

ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న విద్యాసాగర్…

అందువల్ల మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విద్యాసాగర్‌ను చేర్పించారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అధికమవడంతో ఊపిరితిత్తుల మార్పిడి చేయాలని డాక్టర్లు చెప్పారు. అయితే ఆ ఊపిరితిత్తులు కేవలం బ్రెయిన్ డెడ్ అయిన వారి నుండి మాత్రమే సేకరించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో సరైన సమయంలో ఊపిరితిత్తులు ఇచ్చే దాతలు లభించకపోవడంతో మందులతోనే అతడి ఆరోగ్య సమస్యలను నయం చేయటానికి డాక్టర్లు ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తూ మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందాడు. కాగా మీనా భర్త హఠాన్మరణంతో సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు మీనా కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago