Actress Meena: ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్ తాజాగా హఠాన్మరణం చెందారు. కరోనా బారినపడ్డ విద్యాసాగర్ గత కొంతకాలంగా పోస్ట్ కోవిడ్ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొంత సమయం క్రితమే కన్నుమూశారు.

ఈ వార్త ఇటు తెలుగు, అటు తమిళ ఇండస్ట్రీ లో తీవ్ర విషాదం నింపింది. తెలుగు, తమిళ భాషలలో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి ఒక వెలుగు వెలిగిన మీన 2009 లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్ ని వివాహం చేసుకుంది. అప్పటినుండి వీరిద్దరూ ఏంతో అన్యోన్యంగా జీవితం సాగిస్తున్నారు . వీరికి నైనిక ఒక పాప కూడా ఉంది.

ఇదిలా ఉండగా మీనా భర్త విద్యాసాగర్ గత కొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. అంతే కాకుండా ఈ ఏడాది జనవరిలో మీనా కుటుంబం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుంది. ఆ సమయంలో సరైన చికిత్స తీసుకొని అందరూ కరోనా నుండి బయటపడ్డారు. కానీ విద్యాసాగర్ మాత్రం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న విద్యాసాగర్ కి కరోనా వచ్చిన తర్వాత ఊపిరితిత్తుల పనితీరు మరింత క్షీణించింది. ఈ క్రమంలో ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అధికం అయ్యింది.
ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న విద్యాసాగర్…
అందువల్ల మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విద్యాసాగర్‌ను చేర్పించారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అధికమవడంతో ఊపిరితిత్తుల మార్పిడి చేయాలని డాక్టర్లు చెప్పారు. అయితే ఆ ఊపిరితిత్తులు కేవలం బ్రెయిన్ డెడ్ అయిన వారి నుండి మాత్రమే సేకరించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో సరైన సమయంలో ఊపిరితిత్తులు ఇచ్చే దాతలు లభించకపోవడంతో మందులతోనే అతడి ఆరోగ్య సమస్యలను నయం చేయటానికి డాక్టర్లు ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తూ మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందాడు. కాగా మీనా భర్త హఠాన్మరణంతో సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు మీనా కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.
































