Meenakshi Chowdary: మీనాక్షి చౌదరి ఇటీవల గుంటూరు కారం సినిమా ద్వారా తన నటనతో మరింత ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈమె త్వరలోనే విశ్వక్ సేన్ హీరోగా నటించిన మెకానిక్ రాకీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఈనెల 22 తేదీ విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.
మీనాక్షి చౌదరి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో కూడా మీనాక్షి చౌదరి అవకాశాన్ని అందుకున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈమె గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి.
మీనాక్షి చౌదరి అక్కినేని హీరో అయినటువంటి సుశాంత్ ప్రేమలో పడ్డారని వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి. ఇలా ఈమె కూడా అక్కినేని ఇంటి కోడలుగా వెళ్ళబోతున్నారంటూ వస్తున్న ఈ వార్తలపై మీనాక్షి చౌదరి స్పందించారు.
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో నా పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలలో ఏ మాత్రం నిజం లేదని ఈ వార్తలని పూర్తిగా అవాస్తవమని తెలిపారు. మొదట్లో ఈ వార్తను చూసి నేను కూడా షాక్ అయ్యాను. ఇటీవల కాలంలో ప్రతిరోజు నా గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వార్తలకు తాను అలవాటు పడిపోయానని తెలిపారు.. పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని ఈమె మరోసారి ఈ వార్తలను ఖండించారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…