YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్ కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన కామెంట్లకు సంబంధించి ఓ డైలాగ్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ వాడారని వైకాపా అభిమానులు అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని ట్రైలర్ కి సంబంధించిన ఆ వీడియోతో పాటు జగన్ ప్రెస్ మీట్ వీడియోని మిక్స్ చేస్తూ ఒక వీడియోని విడుదల చేశారు.
ఇటీవల పోలీసులు వైకాపా సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్న విషయంపై ఈయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇలా అక్రమంగా తమ కార్యకర్తలను అరెస్టు చేస్తే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోలీసుల సప్త సముద్రాల వెనుక దాక్కున్న పట్టుకొస్తామని పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
ఇకపోతే ఇటీవల పుష్ప 2 నుంచి ట్రైలర్ వీడియో విడుదలైంది ఇందులో భాగంగా అల్లు అర్జున్ ఓ డైలాగ్ చెబుతూ..నాకు కావల్సినది ఏడు కొండల మీద ఉన్నా..7 సముద్రాల దాటి ఉన్నా..పోయి తెచ్చుకునేదే పుష్ప గాడి స్టైల్ అంటూ ఓ డైలాగ్ చెబుతారు. అయితే వైకాపా అభిమానులు మాత్రం ఈ రెండు వీడియోలను ఒక వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ పుష్ప సినిమాకి సపోర్ట్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ ఏపీ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీని కాదని వైకాపా పార్టీకి మద్దతు తెలపడం కోసం నంద్యాల వచ్చారు. అప్పటినుంచి మెగా కుటుంబ సభ్యులు అభిమానులు కూడా అల్లు అర్జున్ వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే వైకాపా అభిమానులు అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తూ పుష్ప2 సినిమాని ఈ విధంగా ప్రమోట్ చేస్తున్నారని చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…