ప్రస్తుత కాలంలో సాంకేతికత అభివృద్ధి చెందడంతో సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో మారుమూల ప్రాంతాలలో జరిగే సంఘటనలు కూడా అందరికీ తెలుస్తున్నాయి. ఈ విధమైనటువంటి వింతలు వినోదాలు ఒక్క క్షణంలో ప్రపంచం మొత్తం చూసేలా చేస్తున్నాయి. ఈ విధమైనటువంటి వీడియోలు ఫోటోలు కొందరికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంటే.. మరికొందరికి మాత్రం లక్షల్లో డబ్బును సంపాదించి పెడుతున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒక అమ్మాయి విషయంలో జరిగింది.
ఒక అమ్మాయి తన చిన్నతనంలో సరదాగా దిగిన ఫోటోను వేలం వేయగా, సుమారు ఐదు మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 3.3 కోట్లు) వెచ్చించి కొన్నాడో వ్యక్తి. అంత ఖరీదు చేసుకొనడానికి ఆ ఫోటోలో ఏముంది? అంత ఖరీదు చేసి కొనాల్సిన అవసరం ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..అమెరికాకు చెందిన జో రోత్ అనే యువతికి ప్రస్తుతం 21 సంవత్సరాలు. ఆమె 2005లో.. తనకు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక కాలిపోతున్న భవనం ముందు నిలబడి ఫోటో దిగింది. చిరునవ్వులు చిందిస్తూ ఉన్నటువంటి ఆ ఫోటో ను రోత్ తండ్రి తీశాడు.
ఆ రోజు ఆ ఫోటో తీసిన ఆ తండ్రి తన జీవితాన్ని మలుపు తిప్పుతుందని ఎప్పుడూ భావించలేదు.జేపీజీ మ్యాగజైన్ నిర్వహించిన ‘ఎమోషన్ క్యాప్చర్’ కంటెస్ట్ వీరి జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ కంటెస్టెంట్ లో తన తండ్రి తాను తీసిన తన కూతురి ఫోటో పంపించారు. ఈ ఫోటో కంటెస్టెంట్స్ ను ఎంతగానో ఆకట్టుకోవడంతో అప్పటి నుంచి ఆమె ‘డిజాస్టర్ గర్ల్’గా ఫేమస్ అయ్యింది.
యూనివర్సిటీ ఆఫ్ కరోలినాలో చదువుకుంటోంది.
‘ఓవర్లీ ఎటాచ్డ్ గర్ల్ ఫ్రెండ్’, ‘బ్యాడ్ లక్ బ్రియన్’ వంటి ఫేమస్ మీమ్స్ లక్షల డాలర్లకు అమ్ముడుపోయాయని తెలుసుకొని ఆశ్చర్యపోయిన వీరు తమ ఫోటోను కూడా వేలం వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 16న ఈ ‘డిజాస్టర్ గర్ల్ మీమ్’ ఒరిజినల్ ఫోటోను 24 గంటల వేలంలో పెట్టారు. అది ఏకంగా 4 లక్షల 70 వేల డాలర్లు అంటే మన భారత దేశ కరెన్సీ లో ఏకంగా మూడు కోట్లకు పైగా డబ్బును వెచ్చించి దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ‘3 ఎఫ్ మ్యూజిక్’ అనే మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీ సీఈఓ ఫర్జిన్ ఫర్దిన్ ఫార్డ్ వేలంలో దక్కించుకున్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది చూసిన నెటిజన్లు ఈ ఫోటో అంత ఖరీదా అంటూ ఆశ్చర్యపోతున్నారు
వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయట అడుగు పెట్టడమే కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో చాలామందిని వేధిస్తున్న…
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన 30వ పుట్టినరోజును ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్న విధానం అభిమానులను ఆకట్టుకుంటోంది. పెళ్లి తర్వాత…
భారతదేశంలో ఆధ్యాత్మిక విశ్వాసాలు, సంప్రదాయాలు ఎన్నో రూపాల్లో కనిపిస్తాయి. దేవాలయాలు, పుణ్యక్షేత్రాలతో పాటు కొన్ని ప్రదేశాలు రహస్య ఆచారాలు, తాంత్రిక…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లల డిజిటల్ భద్రతపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 13 ఏళ్లలోపు పిల్లలను సోషల్…
హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపం అనేది కేవలం వెలుగు మాత్రమే కాదు, అది లక్ష్మీదేవి…
హిందూ సంప్రదాయంలో అత్యంత శుభదాయకంగా భావించే పర్వదినాల్లో అక్షయ తృతీయ ఒకటి. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే ఈ…