E.S.I కుంభకోణం కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా..అచ్చెన్నాయుడు అరెస్ట్ పై, ప్రస్తుతం పరాజయంలో వున్న తెలుగు దేశం పార్టీపై, ఆ జెండాను మోస్తున్న కొన్ని తెలుగు వార్తా ఛానెల్స్ పై మెగా బ్రదర్ నాగబాబు సంచలనమైన కామెంట్స్ చేసి మరోసారి వార్తలలో నిలిచారు. ఈ సందర్భంగా TDP నాయకులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో మెగా బ్రదర్ చేసిన ట్వీట్ కి మంచి స్పందన వస్తోంది. ఇప్పుడా ట్వీట్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ నాగబాబు ట్వీట్ లోని సారాంశం ఏమిటంటే..
‘గతంలో TDP అధికారంలో వున్నప్పుడు ఒక TDP నాయకురాలిని సోషల్ మీడియాలో ఏదో అన్నారని మా జనసేన కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయించారు. వాళ్ళని గొడ్డుని బాదినట్లు బాది.. అంతలా హింస పెట్టిన TDP, ఇప్పడు ఒక నాయకుడి మీద స్కాం జరిగిందని పోలీసులు అరెస్ట్ చేస్తే TDP భజన చేసే మీడియా ఇంతిలా గగ్గోలు పెడుతుందని, కర్మ సిద్ధాంతానికి తిరుగులేదని మా జనసేన కార్యకర్తలని అరెస్ట్ చేసి కొట్టించిన పాపం TDPకి అంత తేలిగ్గా పోతుందా.? అంటూ గతాన్ని గుర్తు చేశారు.
అలాగే తెలుగు దేశం పార్టీ జెండాను, ఆ జెండాను మోస్తున్న కొన్ని తెలుగు వార్తా ఛానెల్స్ ను చూస్తుంటే ముచ్చటేస్తుంది అని నాగబాబు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. TDP ఉప్పు తిన్న విశ్వాసాన్ని , TDPపై వాళ్ళకున్న అనుబంధం, మనవాడు చంద్రబాబు నాయుడు గారు అన్న అభిమానం, మన చంద్రబాబు కోసం ఎంతకైనా తెగించే సాహసం, మన బాబుకి ఉపయోగపడినంత కాలం ఏరు దాటేవరకూ ఏటి మల్లయ్య.. ఏరు దాటేశాక బోడి మల్లయ్య అన్నట్టుగా వుంటుందంటూ ప్రతి పక్ష పార్టీ నాయకులను టార్గెట్ చేసి విమర్శిస్తూ, బాబొరి ప్రయోజనాలను కాపాడే రక్షణ కవచాలుగా వారు చూపిస్తున్న తెగువ, బాబుగారికి దగ్గరగా ఉండే బాబులను కూడా ముద్దు చేసే వారి మమతానురాగాలు wow..
ఇది అసలైన వార్తా పత్రికల స్పిరిట్ అంటే శభాష్ అంటూ నాగబాబు సంచలన కామెంట్స్ చేశారు. ఈ ట్వీట్ లో నాగబాబు చివరలో ఒక్కోసారి జగన్ గారే వీళ్లకు కరెక్ట్ అనే సందేహం వస్తుంది అంటూ ట్వీట్ చేయడంపై TDP ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగబాబుపై ఘాటుగానే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జన సేనకి ఓటు వేసిన వాళ్ళు కూడా ఈ ట్వీట్ పై ఆవేదన వ్యక్తం చేయడం గమనించదగిన విషయం. జన సేన పార్టీ BJPతో చేయి కలపడంపై పలువురు విమర్శలు చేస్తుండగా, టిడిపి నేతలు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…