Mega fans trolls: సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు వయసు మీద పడటంతో సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు నిలువెత్తు విలనిజం చూపించి, మరో వైపు కామెడీ విలన్ గాను చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మెప్పించిన కోటా ప్రస్తుత సినిమాలపైన ప్రెజెంట్ టాప్ హీరోస్ గురించి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో కామెంట్లు చేసారు. ఇక అందులో ఇప్పుడున్న టాప్ హీరోల గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ లో ఇంకా నటుడిని చూడలేదని చిరంజీవి కొడుకుగానే సినిమాల్లో రానిస్తున్నాడని కామెంట్స్ చేసారు.
రంగస్థలం, ఆర్ఆర్ఆర్ కనిపించలేదా…..
ఇక రామ్ చరణ్ ను మంచి నటుడు కాదని పరోక్షంగా అనడం మెగా అభిమానులకు అస్సలు నచ్చలేదు. ఇక కోటాను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. రంగస్థలం, ధ్రువ, ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ నటన నీకు కనిపించలేదా అంటూ ఘాటుగా స్పందించారు. ఇక ఎన్టీఆర్ లా ఎవరు నటించలేరని, అతనికి ప్రెజెంట్ హీరోల్లో పోటీలేరని కోటా వాఖ్యణించిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాన్ని కుడా మేఘా అభిమానులు వదల్లేదు. ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ స్వయంగా రంగస్థలంలో రామ్ చరణ్ లా నేను నటించలేనేమో అని ఆయన ఎంతో హుందాగా వ్యవహారించారు. నీకు మాత్రమే కనిపించడంలేదు మెగా ఫ్యామిలీ పై ఉన్నా వివాదాల కారణంగా ఆ కుటుంబం పై బురదజల్లుతున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక చిరంజీవి ని ఉదేశించి ముందు సినీ కార్మికులకు అన్నం పెట్టించండి ఆసుపత్రి సంగతి మళ్ళీ అని కోటా అన్న మాటలను కూడా ఫాన్స్ తిప్పికొట్టారు. కరోనా లాక్ డౌన్ సమయంలో చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసిస్ చారిటీని ప్రారంభించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కఠినంగా అమలైన రోజుల్లో నెలరోజులకు సరిపడే సరుకులను సినీ కార్మికులకు ఇంటి వద్దకే అందించారు. తెలుగు సినిమా పరిశ్రమ చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఇక ఈ విషయంలో చిరంజీవి చొరవని ఎలా మర్చిపోయావని చురకలేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…