Featured

Mahesh Babu: ఆమెను ట్విట్టర్ లో ఫాలో అవ్వాలని ఉందంటూ మనసులోని మాట చెప్పిన మహేష్..!

Mahesh Babu: సర్కారు వారి పాట సినిమా మే 12న విడుదల అవ్వబోతుంది. ఇక సినిమా ప్రచారాల్లో బిజీగా ఉన్నారు మహేష్ బాబు. అటు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ మరోవైపు పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ చిత్రానికి సంబంధించిన ముచ్చట్లు చెబుతూ అభిమానులకు కనువిందు చేస్తున్నారు. పరుశురాం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తీ సురేష్ నటించింది. ఇక ఇటీవలే ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసారు.

ట్విట్టర్ లో ఆమెను ఫాలో అవుతా….

ఇక సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా యాక్టివ్ గా ఉండే మహేష్ బాబు తరచూ తన ఫ్యామిలీ కి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూంటారు. ఇక ఇపుడు సోషల్ మీడియాను తన సినిమా ప్రొమోషన్స్ కోసం ఉపయోగించుకున్నాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఒక వీడియో ద్వారా మహేష్ బాబు తెలిపారు. ఇక ఇందులో అభిమానులు రకరకాల ప్రశ్నలు వేశారు.

తన గురించి ఒక హ్యాష్ టాగ్ చెప్పమనగా కామ్ మరియు ఫోకస్ అని చెప్పారు. ఇక మీరు ట్విట్టర్ లో ఫాలో అవ్వాలనుకుంటున్న వ్యక్తి ఎవరు అంటే నమ్రత కు ట్విట్టర్ ఉంటే బాగుండు నేను ఫాలో అయ్యుండే వాడిని. ఇక సినిమా వేసవిని మరింత హిట్ చేస్తుందంటూ చెప్పారు. ఇక ఇంట్లో ఎవరు బాగా చురుకు అంటే సితార అంటూ వివరించారు. ఇక సితార పెన్నీ సాంగ్ లో కనిపించింది, త్వరలో సినిమాలో కనిపించి మెప్పిస్తుందా అంటే ఆల్రెడీ తనను తాను నిరూపించుకుంది అని సమాధానం చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago