Varun Tej: మెగా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా అయ్యారు. ఇక ఈయన ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో నటించినటువంటి ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ సినిమా మార్చి 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన అభిమానులతో కలిసి సరదాగా చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలోనే ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని అఖీరాతో తనకు ఉన్నటువంటి బాండింగ్ గురించి ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు వరుణ్ తేజ్ సమాధానం చెబుతూ అఖీరాతో తనకు చాలా మంచి బాండింగ్ ఉందని తెలిపారు. తమ్ముడు ప్రస్తుతం ఉన్నత చదువుల కోసం విదేశాలలో చదువుతున్నారని ఇంతకన్నా తమ్ముడు గురించి ఎక్కువగా చెబితే తనకు దిష్టి తగులుతుంది అంటూ తన తమ్ముడి పై ఉన్నటువంటి ప్రేమను వరుణ్ ఈ సందర్భంగా తెలియజేశారు.
ఇంతకన్నా ఎక్కువ చెప్పను..
ఇలా తమ్ముడు పై ఉన్నటువంటి ప్రేమను మొత్తం బయట పెట్టడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అకిరా అంటే వరుణ్ కి ఇంత ప్రేమ ఉందా వీరిద్దరి మధ్య ఇంత మంచి బాండింగ్ ఉందా అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అకిరా ఎప్పుడెప్పుడు సినిమాలలోకి వస్తారా అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…