Arjun -Gautham: తెలుగు సీజన్ సెవెన్ బిగ్ బాస్ కార్యక్రమం ఎంతో ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం అద్భుతమైనటువంటి రేటింగ్ సొంతం చేసుకుంది. ఇక ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబుగా గౌతమ్ కృష్ణ మొదటి నుంచి హౌస్ లో కొనసాగుతూ రాగా ఆరవ వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బుల్లితెర నటుడు అర్జున్ అంబటి ఎంట్రీ ఇచ్చారు.
ఇక అర్జున్ టాప్ సిక్స్ కంటెస్టెంట్ గా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మరోసారి బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ కూడా బీబీ ఉత్సవ్ అనే పేరిట మరోసారి హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఓ ప్రోమోలో భాగంగా డాక్టర్ బాబుకి గుర్తింపు పొందినటువంటి గౌతమ్ కృష్ణ అర్జున్ కూతురికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.
అర్జున్ భార్య సురేఖ ఇటీవల ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈయన హౌస్ లో ఉన్నప్పుడే ఆమె ప్రేగ్నెంట్. అర్జున్ హౌస్ లో ఉండగా సురేఖ హౌస్ లోకి రావడంతో బిగ్ బాస్ ఆమెకు సీమంతపు వేడుకలను కూడా నిర్వహించారు. ఇలా తనకు కూతురు పుట్టడంతో అర్జున్ కుమార్తె కోసం గౌతం కృష్ణ వెండి పట్టీలను తీసుకువచ్చి సర్ప్రైజ్ చేశారు.
వెండి పట్టీలు..
ఇక అర్జున్ తన కుమార్తె గురించి మాట్లాడుతూ పాప పుట్టగానే మొదట నేనే తనని నా చేతుల్లోకి తీసుకున్నానని చెప్పారు. తాను నా చేతుల్లోకి రాగానే ఒక్కసారిగా పెద్దగా కళ్ళు చేసి నన్ను చూసిందని ఆ క్షణమే తనకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా చూసుకుంటానని ఫిక్స్ అయ్యాను అంటూ ఈ సందర్భంగా అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…