Upasana: మెగా కోడలు ఉపాసన బిజినెస్ ఉమెన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న సంగతి మనకు తెలుస్తుంది. అయితే ఈమె మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత మెగా కుటుంబ సభ్యులతో ఎంతో కలిసిపోయారు. మెగా కుటుంబ సభ్యుల పట్ల ఎంతో ప్రేమను గౌరవాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు..
తాజాగా సురేఖ పుట్టినరోజు కావడంతో ఉపాసన తన అత్తయ్యకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. తన అత్తయ్య పుట్టినరోజు కావడంతో తన అత్తయ్య కోసం అత్తమ్మ కిచెన్స్ అంటూ ఉపాసన సరికొత్త బిజినెస్ ప్రారంభించారు. ఇదే విషయాన్ని సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఇలా తన అత్తయ్య పుట్టినరోజు సందర్భంగా ఉపాసన ఈ బిజినెస్ ప్రారంభించడంతోనే అత్తా కోడల మధ్య ఎలాంటి అనురాగం ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది. ఇలా కొత్త బిజినెస్ ప్రారంభించిన టువంటి ఉపాసన ఇంటికి దూరంగా ఉన్నటువంటి వారందరూ ఇంటి భోజనాన్ని మిస్ కాకుండా ఉండడం కోసమే ఈమె అత్తమ్మ కిచెన్స్ అంటూ ఈ బిజినెస్ ప్రారంభించినట్లు తెలిపారు.
ఆదర్శ మహిళగా ఉపాసన..
ఇప్పటికే అపోలో హాస్పిటల్ వ్యవహారాలన్నింటిని చూసుకుంటూ ఉన్నటువంటి ఉపాసన తాజాగా అత్తమ్మ కిచెన్స్ అంటూ ఈ బిజినెస్ ప్రారంభించడంతో ఈమె ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఇలా ఒకవైపు బిజినెస్ వ్యవహారాలన్నింటిని చూసుకుంటూనే మరోవైపు ఈమె ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…