Featured

Mega Star Chiranjeevi : ఆచార్య దెబ్బకు పేరు మార్చుకున్న చిరంజీవి ? పేరు మార్పుకు కారణం ఇదేనా?

Mega Star Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నుంచి తాజాగా వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళం సినిమా అయిన మోహనలాల్ హీరోగా వచ్చిన లూసిఫర్ కు రీమేక్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ కథతో వస్తున్న ఈ సినిమా లో మెగా స్టార్ కొత్త లుక్ తో ఉండటమే కాదు ఈ సినిమాలో నయనతార, సల్మాన్ ఖాన్ కూడా నటిస్తుండటం విశేషం. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అంతే కాదు థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. థమన్ మొదటిసారి మెగా స్టార్ సినిమాకి సంగీతం ఇస్తున్నాడు.

ఆచార్య సినిమా కాస్త నిరాశ పరచడంతో పాటు అభిమానులతో పాటు మెగా స్టార్ కూడా ఈ సినిమా మీద ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్ అభిమానులను ఆకట్టుకోవడమే కాదు అంచనాలను పెంచుతోంది. టీజర్ లో మెగా స్టార్ లుక్, థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయి.

టీజర్ వీడియోలో స్వల్పంగా మారిన చిరంజీవి పేరు…

ఇక నిన్న విడుదల అయిన ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంటే, టీజర్ వీడియోలోని టైటిల్స్ లో మెగా స్టార్ పేరు స్వల్పంగా మారింది. ప్రస్తుతం అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. టైటిల్స్ లో “MEGA STAR CHIRANJEEEVI” అని వుంది. అయితే ఎప్పుడూ ‘CHIRANJEEVI’ అని ఉంటుంది ఇపుడు కొత్తగా మరో ‘E’ ని అదనంగా జోడించారు. దీనికి కారణం న్యూమారాలజీ ప్రకారం వచ్చిన మార్పు కారణం అయ్యుంటుంది అని నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. మరికొంత మంది మాత్రం ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో చిరంజీవి తన పేరులో స్వల్ప మార్పు చేసుకున్నాడని అంటున్నారు..

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago