Mega Star Chiranjeevi : సినీ అభిమానులకు పరిచయం అవసరంలేని పేరు మెగాస్టార్ చిరంజీవి. ‘పునాది రాళ్లు’ సినిమా ద్వారా తన నట జీవితాన్ని ప్రారంభించిన చిరంజీవి ఇప్పటి వరకు 150 పైగా సినిమాలలో నటించి అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో ముందుకు వెళ్తున్నాడు. త్వరలో చిరంజీవి హీరోగా ‘గాడ్ ఫాదర్’ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేల ఒక బాలీవుడ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
రాజమౌళితో సినిమా చేయాలని లేదు…
రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలని అందరూ ఎదురు చూస్తుంటారు. అయనతో సినిమా చేసే అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. అయితే చిరంజీవి మాత్రం నాకు రాజమౌళి తో సినిమా చేయాలని లేదు అని ఇదివరకే చెప్పారు. అయితే తాజాగా బాలీవుడ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్థావించగా రాజమౌళి ఒక అద్భుతమైన దర్శకుడు. భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రతి సీన్ లో, నటులలో అనుకున్న పర్ఫెక్షన్ వచ్చేవరకు శ్రమిస్తారు, నటుల నుంచి తాను అనుకున్నది రాబడతారు.
తన అంచనాకు తగ్గట్టు నేను నటిస్తానో లేదో నాకు తెలియదు. ఇక రాజమౌళి ఒక సినిమాను ఎన్ని సంవత్సరాలు తీస్తాడో మనకు తెలిసిందే. నేను ఒక్కోసారి నాలుగు అయిదు సినిమాలతో బిజీ గా ఉంటాను. అందుకే నాకు ఆయనతో సినిమా చేయాలని, పాన్ ఇండియా ఇమేజ్ తెచుక్పవాలని లేదు. కానీ నాకు ఒక సినిమాకి దర్శకత్వం చేయాలని ఉంది అని తన మనసులో మాట చెప్పుకొచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…