Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా ఈయన పద్మ విభూషణ్ అవార్డును కూడా సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఇంత గొప్ప అవార్డు వచ్చిన తర్వాత చిరంజీవి మొదటిసారి వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరు అయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ గురించి చిరంజీవి మాట్లాడుతూ ఆయనపై ప్రశంసలు కురిపించడమే కాకుండా టాలీవుడ్ డైరెక్టర్లకు పరోక్షంగా కూడా ఈయన క్లాస్ పీకారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్గ్రౌండ్ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారని తెలిపారు.
ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఎంతో గొప్పగా అనిపించింది చాలా తక్కువ ఖర్చుతో అద్భుతమైనటువంటి విజువల్స్ చూపిస్తూ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని అయితే ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఈయన తెలిపారు. డబ్బు ఎక్కువ ఖర్చు పెడితేనే సినిమాకు రిచ్ నేస్ రాదని తెలిపారు.
ఖర్చు పెడితేనే రిచ్ నెస్ రాదు…
ఈ విషయంలో డైరెక్టర్ శక్తి ప్రతాప్ మన టాలీవుడ్ డైరెక్టర్లకు ఆదర్శమని, తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేసేలా ప్లాన్ చేయాలని అప్పుడే నిర్మాతలు అలాగే ఇండస్ట్రీ కూడా బాగుంటుంది అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…