Megastar Chiranjeevi : చిరంజీవిని తన ప్రాణ స్నేహితుడు హరిప్రసాద్ ఇంతగా నమ్మించి మోసం చేశాడా !?

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి… తెలుగు సినీ ఇండస్ట్రీలో స్వయంకృషితో, పట్టుదలతో అత్యున్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి ఈయన. చిన్నప్పటి నుంచే అనేక నాటకాల్లో నటించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో కష్టాలు పడుతూ కొణిదెల శివశంకర వరప్రసాద్ గా మొదలుపెట్టిన ప్రస్థానం ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవిగా కొనసాగుతున్నాడు. అయితే ఎవరికైనా సరే తన బాల్యంలోనే విశేషాలు గమ్మత్తుగానే ఉంటాయి. ఇక అసలు విషయానికి వస్తే.. చిరంజీవి స్నేహితుడైన హరిప్రసాద్ తనను మోసం చేశారట. అది ఏమిటో ఎప్పుడూ ఎలా జరిగిందో ఒకసారి చూద్దామా….!

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో నటించే ముందు ఆయన నటన కోసం చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరాడు. అలా అక్కడ తన నటన పాటవాలను నేర్చుకున్న వ్యక్తి చిరంజీవి. అయితే ఇక అందరికీ తెలిసిన విధంగానే మెగాస్టార్ చిరు, హాస్యనటుడు సుధాకర్, మరొక నటుడు హరి ప్రసాద్ వీరు ముగ్గురు ప్రాణ స్నేహితులు. వీరందరూ కలిసి నరసాపురంలో ఒక రూమ్ లో ఉంటూ సినిమా ప్రయత్నాలు కూడా చాలా చేశారు. అయితే మొదటగా కమెడియన్ సుధాకర్ తమిళ సినిమాలో హీరోగా ఛాన్స్ రావడం జరిగింది. అయితే ఆ దర్శకనిర్మాతలు ఈ సినిమా చేసే సమయంలో ఇంకో సినిమా చేయకూడదని కండిషన్ పెట్టారు. అయితే అంతకు ముందే తెలుగులో పునాదిరాళ్లు సినిమాలో చేయడానికి సుధాకర్ ఒప్పుకున్నారు. అయితే తమిళ సినిమాలో హీరోగా నటించేందుకు ఆ సినిమా ఛాన్స్ ను చిరంజీవి కి ఇవ్వడం జరిగింది.

అయితే ఇక మెగాస్టార్ చిరంజీవి, సుధాకర్ ర్ లకు హరిప్రసాద్ మోసం చేసిన సంగతి విషయానికి వస్తే… వీరందరూ కలిసి ఉన్నప్పుడు వారి మధ్య జరిగిన సంఘటన చాలా సున్నితంగా, హాస్యాస్పదంగా వారు చెప్పుకునే వారు. అయితే హరి ప్రసాద్ ఒక సినిమా విషయంలో వారిద్దరిని బోల్తా కొట్టించి తను హీరో ఛాన్స్ కొట్టేశాడు అని మిగతా ఇద్దరు స్నేహితులు నవ్వుతూనే చెబుతుంటారు. అసలు ఏం జరిగిందంటే శివరంజని సినిమా కోసం హీరో వేటలో ఆ సినిమా యూనిట్ ఉండగా వారికి పిలుపు వచ్చింది. అయితే హరి ప్రసాద్ తన అతి తెలివి ప్రదర్శనతో ఆ సినిమా యూనిట్ సభ్యులతో చిరంజీవి, సుధాకర్ వారు ఊరిలో లేరని చెప్పి ఆ సినిమాలో ఛాన్స్ ను కొట్టేశారట. ఈ విధంగా మెగాస్టార్ ని హరిప్రసాద్ తన తెలివితో చిన్నపాటి మోసం చేసి హీరో ఛాన్స్ ని కొట్టేశారట. అయితే ఇక ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి అలాగే సుధాకర్ ఇప్పటికి హరి ప్రసాద్ ను ఉద్దేశించి చాలా ఆనందంగా చెప్పుకుంటారు తప్పించి ఆయనను ఒక్క మాట కూడా చెడుగా మాట్లాడిన రోజులు లేవు. ఎక్కడైనా స్నేహితులు అంటే ఇలానే ఉండాలి ఒకరు మోసం చేశారని అతనిపై కక్ష సాధించి బాధించకూడదు.