చాలాకాలం విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఖైదీ నెంబర్ 150 మూవీ తో బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు.లేటుగా వచ్చినా లేటెస్ట్ గా రావడంతో చిరు అభిమానులకు కొండంత పండగ అయ్యింది. మెగాస్టార్ దూకుడు చూసి కుర్ర హీరోలంతా బెంబేలెత్తిపోతున్నారు.ఖైదీ నెంబర్ 150 మూవీ లో చిరు ఎంతో హ్యాండ్సమ్ గా ఒక కొత్త లుక్ లో కనిపించారు.ఆ నాటి పాత చిరంజీవి మళ్లీ కుర్ర హీరోగా కనిపించారని అభిమానులు థియేటర్ల వద్ద రచ్చ రంబోలా చేయడం మెగాస్టార్ స్టామినా కి నిదర్శనంగా పేర్కొనవచ్చు.
ఎప్పటి నుంచో ఒక పీరియాడికల్ మూవీ చేయాలన్నా చిరంజీవి ఆలోచనకు పరుచూరి బ్రదర్స్ చెప్పిన స్వతంత్ర సమరయోధుడు నరసింహారెడ్డి కథ చిరంజీవికి నచ్చడంతో దానిని చేయాలన్నా ఆలోచన వచ్చినప్పటికీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ప్రాజెక్టు ను కాస్త పక్కకు పెట్టాల్సి వచ్చింది.ఆ తర్వాత రాజకీయాల్లో అంతగా సక్సెస్ కాకపోవడంతో తిరిగి సినిమాల్లోకి రావాలనుకున్నాడు దాదాపు ఎనిమిది సంవత్సరాల విరామం తో మళ్లీ సినిమా చేస్తే ప్రేక్షకులు అంతగా రిసీవ్ చేసుకుంటారా అనే సందేహంతో వచ్చిన తన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 బ్లాక్ బస్టర్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి కి ఎక్కడలేని కొత్త ఉత్సాహం వచ్చింది.ఆ తర్వాత వచ్చిన 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి లో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
కొరటాల దర్శకత్వంలో లో చిరంజీవి 152 వ మూవీగా ఆచార్య షూటింగు దాదాపు సగం పూర్తయింది. ఈ సినిమా అనంతరం సుజిత్ దర్శకత్వం లో లూసిఫర్ పట్టా లెక్కబోతుంది బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ చిరంజీవితో మరో సినిమా చేయబోతున్నారు. ఇది ఇలాగ ఉండగా రామ్ చరణ్ నటించిన నవినయ విధేయ రామ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ తాను త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నానని స్వయంగా మెగాస్టార్ ప్రకటించారు.అదేవిధంగా బోయపాటి శ్రీను చెప్పిన కొన్ని కథలను విన్న చిరంజీవి త్వరలోనే బోయపాటి తో ఒక కమర్షియల్ మూవీ రాబోతుందని తెలుస్తుంది.సో బోయపాటి చిరుల అరుదైన కాంబినేషన్ లో వచ్చే సినిమా రికార్డులను ఏ విధంగా తిరగరాస్తుందో వేచి చూడాల్సిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…