కొన్ని విచిత్రాలు బయటనే కాదు సిని పరిశ్రమలో కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని కాంబినేషన్స్ కొందరి మధ్య వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఆ జానర్లో మరో కాంబినేషన్ ఊహించుకోవడం సాధ్యం కాదు. అలా అరుదుగా ఏదైనా కాంబినేషన్ కుదిరితే ఆ సినిమా హిట్టా పట్టా అవుతూ ఉంటుంది.ఇది నాటి పాతాళభైరవి నుండి నేటి బాహుబలి వరకు కొనసాగుతూనే ఉంది.
సాంఘిక చిత్రాలు మరియు కుటుంబ నేపథ్య కథలతో నాగేశ్వరరావు లాంటి హీరోతో సినిమా తీసినప్పటికీ1982 లో విచిత్రంగా కళా దర్శకుడు విశ్వనాథ్ యాక్షన్ హీరో చిరంజీవి శుభలేఖ చిత్రం తీశారు. చిరంజీవి విశ్వనాధ్ భిన్నమైన పంథాలను కలిగి ఉండడం వలన శుభలేఖతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బోల్తా పడ్డారు.
అలాగే 1988లో కె.బాలచందర్ చిరంజీవి కాంబినేషన్ లోవచ్చిన రుద్రవీణ బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను కలిగించింది. దర్శకత్వం బాగున్నప్పటికీ ఒక మూస కథలలో యాక్షన్ హీరో నటించడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు ఫలితంగా రుద్రవీణ చిత్రం ఒక డిజాస్టర్గా మిగిలిపోయింది
రామ్ గోపాల్ వర్మ 1989లో శివ అనే ఒక ఇండస్ట్రీ హిట్ సినిమాతో ఒక కొత్త పంథాలో సినిమా తీసి యువతను తీవ్రంగా ప్రభావితం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే శివ సినిమా చిత్ర పరిశ్రమ గమనాన్ని మార్చేసింది. వర్మ నాగార్జున వెంకటేష్ ల తర్వాత చిరంజీవితో సినిమా తీయాలనుకొన్నాడు. ఆ అవకాశం వైజయంతి మూవీస్ బ్యానర్ లో వర్మ చేతిలోకి వచ్చింది.
అయితే స్క్రిప్టు విషయంలో కొన్ని మార్పులు చేయాలని చిరంజీవి సూచించగా… రామ్ గోపాల్ వర్మ అందుకు నిరాకరించాడు. స్క్రిప్ట్ విషయంలో జోక్యం ఎవరు చేసుకోకూడదని ఒకవేళ చేసుకుంటే తాను సినిమా వదిలేయడానికి సిద్ధమని రామ్ గోపాల్ వర్మ నిక్కచ్చిగా ఉంటాడు. చిరంజీవి సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. రాంగోపాల్ వర్మ స్క్రిప్ట్ మార్చడం అస్సలు కుదరదు కరాఖండిగా చెప్పి ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. అయితే ఈ సినిమా కోసం రూపొందించిన 2 పాటలను చూడాలని ఉంది సినిమాలో ఉపయోగించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…