Mehar Ramesh: మెహర్ రమేష్ కంత్రి బిల్లా వంటి సక్సెస్ సినిమాలను అందుకున్నటువంటి ఈ డైరెక్టర్ అనంతరం శక్తి షాడో వంటి డిజాస్టర్ సినిమాలను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. అయితే మెహర్ రమేష్ సక్సెస్ సినిమాల కన్నా ఫెయిల్యూర్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి.ఇలా వరుస ఫెయిల్యూర్ వెంటాడటంతో ఈయన కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
చాలా సంవత్సరాల తర్వాత ఈయన ఇండస్ట్రీలోకి ఇది ఎంట్రీ ఇస్తూ మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ఆగస్టు 11 వతేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మెహర్ రమేష్ ఎన్ని సంవత్సరాలు పాటు ఇండస్ట్రీకి గ్యాప్ రావడానికి గల కారణాలను తెలిపారు.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను చిరంజీవి గారికి పెద్ద అభిమానిని ఆయనతో సినిమా చేయాలని కోరిక ఎప్పటినుంచో ఉంది అయితే ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరిందని రమేష్ వెల్లడించారు.ఇకపోతే ఇన్ని రోజులపాటు తాను ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం లేకపోలేదు తాను షాడో తర్వాత పలు కథలను సిద్ధం చేసుకున్నాను. అదే సమయంలో చిరంజీవి అన్నయ్య రీ ఎంట్రీ ఇస్తున్నారని తెలిసింది.
ఇలా చిరంజీవి గారు రీ ఎంట్రీ ఇవ్వడంతో తనతోనే సినిమా చేయాలని ఇన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని తెలిపారు. అందుకే షాడో లో ఉన్న నా జీవితంపై చిరంజీవి అనే వెలుగు పడింది అంటూ ప్రీరిలీజ్ వేడుకలో చెప్పానని ఈ సందర్భంగా రమేష్ ఇన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి గ్యాప్ ఇవ్వడం గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…
ప్రతిరోజూ ఉదయం చాలా మంది తమ రాశిఫలాన్ని చూసి రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంటారు. గ్రహాల సంచారం,…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి…