Mehboob Dilse:ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఇండస్ట్రీకి చెందినవారు లేదా వారి కుటుంబ సభ్యులు మృతి చెందడంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమను షాక్ కి గురిచేస్తుంది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మెహబూబ్ గురించి అందరికీ సుపరిచితమే బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఈయన అంచలంచెలుగా ఎదుగుతూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్న మెహబూబ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తాను ఎంతగానో ప్రేమించే తన తల్లి మృతి చెందడంతో ఒక్కసారిగా తన ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. మెహబూబ్ తల్లి గుండెపోటుతో మరణించడంతో ఈయన కన్నీళ్లు మున్నీరు అవుతున్నారు. ఈ క్రమంలోనే తన తల్లిని తలుచుకొని మహబూబ్ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా తన తల్లిని తలుచుకుంటూ అమ్మా ఎందుకు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు ధైర్యంగా నేను ఎలా నిర్ణయాలు తీసుకోవాలి నేను రోజు ఎవరితో మాట్లాడాలి.. నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో తెలియడం లేదమ్మా అంటూ ఎమోషనల్ అయ్యారు. నా ప్రతి ఒక్క సందర్భంలోనూ నా వెనకే ఉండి నన్ను ప్రోత్సహించావు. నా ఎదుగుదలను చూసి మురిసి పోయావు అంటూ ఎమోషనల్ అయ్యారు.
Mehboob Dilse: మా కోసం సర్వస్వం త్యాగం చేశావు…
మా కోసం మా ఎదుగుదల కోసం సర్వస్వం త్యాగం చేసిన నువ్వు మా మధ్య లేకపోవడంతో ఇకపై మా జీవితంలో ఎలా ముందుకు సాగాలో తెలియడం లేదు ప్రతిక్షణం నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను నువ్వు ఎక్కడున్నా నన్ను చూస్తూ ఉంటావని నాకు తెలుసు. తమ్ముడికి నాన్నకి ఏ విధమైనటువంటి కష్టం రాకుండా చూసుకుంటాను. నువ్వు గర్వపడేలా మరింత స్థాయికి ఎదుగుతాను అంటూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇలా మెహబూబ్ తల్లి మరణించారనే విషయం తెలియగానే పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ లు తనకు ఫోన్ చేసి పరామర్శించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…