Nayanatara-Mehreen: లేడి సూపర్ స్టార్ తో మెహ్రీన్..బుర్జ్ ఖలీఫా దగ్గర దిగిన ఫొటో వైరల్..!
Nayanatara-Mehreen: కొద్దిగా విరామం దొరికితే చాలు నయనతార.. ప్రియుడు విఘ్నేష్ శివన్ తో టూర్ కు చెక్కెస్తోంది. గతంలో కూడా వీరిద్దరు సమయం దొరికినప్పుడల్లా విదేశాల్లో విహరిస్తున్నారు ఈ ప్రేమ జంట. ఇటీవల ఓనం పండగ ఏకంగా ప్రైవేట్ జెట్ లో కేరళ వెళ్లిన ఈ జంట అక్కడే పండగనను సెటబ్రేట్ చేసుకుంది.
తాజాగా న్యూ ఇయర్ వేడుకల కోసం వీరిద్దరు దుబాయ్ కి వెళ్లారు. అక్కడ బుర్జ్ ఖలీఫా ముందు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఆఫిక్స్ కూడా వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే పెళ్లి ఎప్పుడనే విషయాన్ని ఇటు నయనతార కానీ.. అటు విఘ్నేష్ శివన్ కానీ క్లారిటీ ఇవ్వడం లేదు. వీరి పెళ్లి పై మాత్రమ ఎప్పటికప్పుడు రూమర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
తాజాగా ‘ఎఫ్ 3’ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా.. నయనతారతో దిగిన ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవల దుబాయ్ వెళ్లిన మెహ్రీన్.. ఓ షాపింగ్ మాల్ కు వెళ్లిన సమయంలో నయనతార తారసపడింది. దీంతో ఆమెతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది.
ఈ విషయాన్ని తన ఇన్ స్టా ద్వారా తెలియజేసింది. ‘‘ చివరికి లేడీ సూపర్‌స్టార్ నయనతారను కలవడం చాలా బాగుంది” అంటూ రాసుకొచ్చింది. దుబాయ్ లో నయనతార, విఘ్నేష్ శివన్, మెహ్రిన్ కలిసి టైం స్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. మెహ్రీన్ షేర్ చేసిన ఈ పిక్ లో నయన్ ఎరుపు రంగు పోల్కా చుక్కల స్కర్ట్ తో మెస్మరైజింగా ఉండగా… మెహ్రీన్ హుడీ, డెనిమ్ స్కర్ట్ లో వావ్ అనిపించేలా ఉంది. ఇదిలా ఉంటే నయన్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు షారుఖ్ ఖాన్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో రానున్న ఓ సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఓ మళయాళ, రెండు తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…