Minister RK Roja : సినిమాల్లో హీరోయిన్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. రోజా అన్ని భాషల్లోను హీరోయిన్ గా నటించింది. ఇక పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన రోజా అటు బుల్లితెర మీద అదరగొట్టింది. మోడరన్ మహలక్ష్మి తో మొదలు పెట్టి జబర్దస్త్ తో మరోసారి మంచి ఫామ్ లోకి వచ్చింది. అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఇటు జబర్దస్త్ షో చేస్తూ ఉండే రోజా పాలిటిక్స్ లో మొదట టీడీపీతో మొదలు పెట్టి ఆ తరువాత వైసీపీ లోకి వెళ్లి ప్రస్తుతం నగరి ఎమ్మెల్యే గా ఉంటూ అలానే మంత్రిగా జగన్ కేబినెట్ లో కొనసాగుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఒక ఊరినే దత్తత తీసుకున్నారు, అలానే ఆర్థికంగా ఇబ్బందులుండి తల్లి దండ్రులు లేక చదువుకోలేని వాళ్లకు చదువు అందిస్తూ ప్రజా సేవ చేస్తున్నారు రోజా. ఇక రోజా కుటుంబం గురించి అందరికీ తెలిసిందే.
కొడుకును రాజకీయల్లోకి రమ్మంటే…
రోజా డైరెక్టర్ సెల్వమణి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక అమెకు ఇద్దరు పిల్లలు, పాప అన్షు మాలిక తల్లి లానే సమాజ సేవ వైపు దృష్టి పెట్టి చిన్న వయసులోనే ఎందరికో సహాయం చేస్తోంది. ఇక కొడుకు కృష్ణ లోహిత్ సెల్వమణి చదువుకుటుండగా తన పిల్లలు గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు రోజా. తన కొడుకుకి తన లక్షణాలు చాలా వచ్చాయని, తన చుట్టూ ఉండే జనం కోసం ఆలోచిస్తాడని, అందరితో కలిసి పోయి ఉంటాడని ఎవరికైనా ఏ సహాయం కావాలన్నా అది చేసే వరకూ ఉండలేదంటూ చెప్పారు.
ఇక లోహిత్ ఎప్పుడూ నా చుట్టూ ఉండేవాడు ఇప్పుడు నాకన్నా ఎత్తు అయిపోయి పెద్దోడైపోయాడు అంటూ చెప్పారు. తన చుట్టూ ఉన్న వాళ్లకు లీడర్ లాగా గైడ్ చేస్తుంటాడు అందుకే రాజకీయాల్లోకి వస్తావా అని అడిగితే పో మమ్మీ నేను బిజినెస్ చేస్తాను రాజకీయాల్లోకి రాను అని చెప్తాడు. తనకి అపద్ధం చెప్పడం అంటే అసలు నచ్చదు, ఎవరి ముందైనా నిజాలే మాట్లాడుతాడు అంటూ కొడుకు గురించి చెబుతూ మురిసిపోయారు మినిస్టర్ రోజా.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…