Featured

Heroine Amani : నాకు పిల్లలు పుట్టరని నా కన్న తల్లి నన్ను హేళనగా మాట్లాడినపుడు నేనేం చేసేదాన్ని అంటే…: హీరోయిన్ ఆమని

Heroine Amani : సహజమైన తన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుని సగటు ఇల్లాలి పాత్రలో ఒదిగిపోయి నటించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన హీరోయిన్ ఆమని. హీరోయిన్ గా మంచి పాత్రలను చేసి తన నటనను నిరూపించుకున్న ఆమని ప్రస్తుతం సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూ, అటు బుల్లితెర మీద కూడా సందడి చేస్తోంది. ఇటీవలే ఎమ్సీఏ, చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలలో నటించింది. ఇక బుల్లితెర మీద అటు రియాలిటీ షోకి అప్పుడప్పుడు జడ్జిగా వ్యవహారిస్తూ ఇటు సీరియల్స్ కూడా నటిస్తూ అలరిస్తున్న ఆమని తన కెరీర్ అలాగే వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

పిల్లలు పుట్టరని మా అమ్మ అలా అనేది…

సినిమాల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమని తన జీవితంలో అన్నీ నిదానంగానే దొరుకుతాయి అంటూ చెప్తూ తనకు పెళ్లయ్యాక సంతానం కూడా ఆలస్యంగానే అయింది అంటూ చెప్పారు. అయితే పిల్లలు లేరని ఎవరు ఏ దేవుడికి మొక్కమని ఏ పూజ చేయమని చెప్పినా చేసేదాన్ని అంటూ చెప్పారు ఆమని. అయితే తన తల్లి మాత్రం ఎన్ని పూజలు చేసినా నీకు పిల్లలు పుట్టరు కానీ వెళ్లి సినిమాలు చేయి మళ్ళీ బిజీ అవ్వు అంటూ చెప్పేది.

కానీ నాకు ఆ మాటలకు కోపం వచ్చేది. దేవుడి దగ్గరికి వెళ్లి ఆయనతో గొడవ పడే దాన్ని అలా గుడికి ఎక్కువగా వెళుతున్న సమయంలో ఒక పూజారి ఎందుకు ఎక్కువగా గుడికి వస్తున్నారు అని అడిగితే ఇలా నాకు పిల్లలు కాలేదు అందుకు అని అంటే మీ ఇంటి దేవుడు ఎవరు అని అదిగి వెంకటేశ్వర స్వామి అని చెప్పగానే ఆయనకే వెళ్లి పూజ చేయండి మీకు పిల్లలు పుడతారు అని చెప్పారు. వెంకటేశ్వర స్వామిని ఒక్క పాప ను ఇవ్వు అని అడిగేదాన్ని కానీ నాకు ఇద్దరు పిల్లలను ఆ దేవుడు ఇచ్చాడు. అలా నిదానంగా ఇచ్చినా ఏదైనా ఎక్కువ ఇస్తాడు నాకు దేవుడు అంటూ ఆమని తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago