కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. ఇటు మన దేశంలో కూడా కరోనా బాదితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపద్యంలో కరోనా కట్టడికోసం ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ వైరస్ ను నియంత్రించడం సాధ్యపడటం లేదు. లాక్ డౌన్ పై కేంద్రం ఇచ్చిన సడలింపులతో భారీగా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. దీనితో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే రోజుకు దాదాపు 150 కొత్త కేసులు నమోదవుతుండటం ఆంధోళన చెందాల్సిన విషయం.
హైదరాబాద్ పరిధిలో భారీగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ ను విధిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.
తాజాగా ఈ విషయం పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలంచేకూరేలా మారాయి. హైదరాబాద్ నగరంలో కరోనా కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతున్న ఈ సమయంలో నగరంలో మళ్ళీ సంపూర్ణ లాక్ డౌన్ విధించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. అయితే నగరంలో లాక్ డౌన్ విధించాలా వద్దా అనే దానిపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని, ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చర్చలు జరుపుతున్నారని ఆయన తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ విషయంపై స్పష్టత వస్తుందని తెలిపారు. అయితే లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో ప్రజలు కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు మంత్రి తలసాని
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…