శ్రీదేవి.. ఎందరో అభిమానుల ఆరాధ్య దేవత శ్రీదేవి. సెలెబ్రేటిస్ నుంచి సాధారణ ఆడియన్స్ వరకు ఎందరో అభిమానులు ఆమె సొంతం. అందం, అభినయంలో ఆమె తరువాతే ఎవరైనా.. కేవలం ఆన్ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్ పై కూడా ఆమె చాలా హుందాగా ప్రవర్తిస్తారని ఇప్పటికి చెబుతుంటారు ఆమెతో నటించిన తోటి నటీనటులు. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల ప్రేక్షకుల గుండెల్లో ఆమె తనకంటూ ఎప్పటికి చెరిగిపోని సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.
ఎటువంటి పాత్రనైనా అవలీలగా చేయడం ఆమెకే చెల్లింది. తెలుగు తెరపై ఆమె ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి ఒకప్పటి స్టార్స్ నుంచి మొదలుకొని చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి నిన్నటి తరం స్టార్స్ వరకు అందరి సరసన నటించి ప్రేక్షకులను అలరించింది శ్రీదేవి. అదే సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూడా పలు చిత్రాల్లో నటించింది. ఇక అసలు విషయానికి వస్తే… ఒక సినిమాలో శ్రీదేవి రజనీకాంత్ కి తల్లిగా నటించిన విషయం ఎంత మందికి తెలుసు? ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు కానీ అప్పటి తరానికి మాత్రం ఇది తెలిసిన విషయమే.
ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన “ముండ్రు ముడిచ్చు” అనే తమిళ చిత్రంలో రజనికాంత్ సవతి తల్లిగా నటించారు శ్రీదేవి. అప్పుడు ఆమె వయస్సు 13 ఏళ్ళు. ఈ కధలో తనను ప్రేమించిన వ్యక్తిని దూరం చేసినందుకు రజినీపై కోపంతో పగ తీర్చుకునేందుకు అతని తండ్రిని పెళ్లి చేసుకుని సవతి తల్లిగా మారుతుంది శ్రీదేవి. ఆ తరువాత రజని, శ్రీదేవిల జోడి హిట్ పెయిర్ గా పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…