MLC Anantha Babu's driver case comes to the fore again.. Court orders investigation!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు ఆగడం లేదు. గతేడాది ఎన్నికల్లో ఘోర ఓటమితో అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి ప్రతీ రోజు ఏదో ఒక విఘాతం ఎదురవుతోంది. తాజాగా మద్యం స్కాం కేసుతో పార్టీకి పలు ఇబ్బందులు తలెత్తుతుండగా, మరోవైపు జగన్ పర్యటనల సమయంలో నమోదైన కేసులపై మాజీ మంత్రుల్ని పోలీసులు విచారణకు పిలవడం చూస్తున్నాం. ఇదే సమయంలో ఇప్పుడు మరో కీలక కేసు మరోసారి జోరందుకుంది. అదే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు.
2022లో వెలుగులోకి వచ్చిన ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రమణ్యంను వ్యక్తిగత కలహాల నేపథ్యంలో కొట్టి చంపి, మృతదేహాన్ని మూటగట్టి తన ఇంట్లోనే పడేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతబాబు ఈ హత్యను చేసినట్టు పోలీసులు చేపట్టిన విచారణలో అంగీకరించారు కూడా. అనంతరం ఈ కేసు కొంతకాలం నిశ్శబ్దంగా కొనసాగింది. అయితే ఇటీవలే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కేసుపై మరింత దృష్టి సారించింది.
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి సర్కార్, విచారణను మరోసారి వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) వేయాలంటూ వినతిని సమర్పించింది. కోర్టు దీనిపై విచారణ జరిపి విభిన్న కోణాల్లో దర్యాప్తుకు అనుమతి ఇచ్చింది. అంతేకాదు, 90 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు అనంతబాబును మరోసారి అరెస్టు చేసి విచారణ జరిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు.
ఈ కేసు పునఃప్రారంభం రాజకీయంగా కూడా కీలక పరిణామాలకు దారితీయనుంది. ముఖ్యంగా ఎస్సీ వర్గాల్లో తమ పట్టు పెంచుకోవాలనే లక్ష్యంతో కూటమి సర్కార్ దీనిని సీరియస్‌గా తీసుకుంటోంది. న్యాయ ప్రక్రియలో ఎలాంటి లోపాలు ఉండకుండా చూసేందుకు న్యాయ నిపుణుడు ముప్పాళ్ల సుబ్బారావు సేవలను ప్రభుత్వం వినియోగించుకుంది.
ఈ కేసు త్వరలో తుది మలుపు తిరిగే అవకాశముండగా, అనంతబాబుకు నేరం నిరూపితమైతే వైసీపీకి ఇది మరో దెబ్బగా మిగిలే అవకాశం కనిపిస్తోంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…
స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళనాడులో జరిగిన తాజా రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్…
రివ్యూ: A Beautiful Breakup ప్రేమ కథలు సాధారణంగా కలిసే క్షణంతో మొదలై, కలిసి ముగుస్తాయి. కానీ ‘ఎ బ్యూటిఫుల్…