Featured

Modi – YS Jagan : మోదీ – జగన్‌ల బంధం చెడిందా? సడన్‌గా ఏపీని పంజాబ్‌తో ప్రధాని పోల్చడమేంటి.. ఇక అంతా అయిపోనట్టేనా..?

Modi – YS Jagan : రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారనేది చెప్పలేం. ఇక్కడ ఎవరి స్వప్రయోజనాలు వారివి. అవసరమైతే ఎదుటి వారిని ముంచేయాలి. అలా చేయగలిగితేనే రాజకీయాల్లో రాణిస్తారు. ఇక ముందు ఒక మాట.. వెనుక ఒక మాట కూడా కామనే. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? దీనికి ముందు మనం ఏపీ సీఎం జగన్, ప్రధాని నరేంద్ర మోదీల బంధం గురించి మాట్లాడుకోవాలి. వీరిద్దరి మధ్య మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉంది. మోదీ ఏదైనా చేస్తే.. దేశం మొత్తం విమర్శించినా జగన్, ఆయన పార్టీ నేతలు మాత్రం పల్లెత్తి మాట అనరు. అలాగే చుట్టూ కేసులున్నా కూడా జగన్‌ దరికి ఏ కేసు రానివ్వకుండా చూడటం.. అడిగినప్పుడల్లా కాదనకుండా అప్పులిచ్చి ఆదుకోవడం వంటివి కేంద్రం చేస్తుంటుందని ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నాయి. నిజమే జగన్ ఎప్పుడు అప్పు కోసం ఢిల్లీ వెళ్లినా కూడా ఉత్త చేతులతో అయితే తిరిగి రారు. ఇవన్నీ ఇలా ఉంటే.. ప్రధాని మోదీ.. జగన్ ముందు ఒక మాట.. లేనప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని టాక్ బీభత్సంగా నడుస్తోంది.

అసలెందుకీ ప్రచారం..?

ప్రధాని మోదీ.. జగన్ ముందు ఒక మాట మాట్లాడుతున్నారు.. వెనుక ఒక మాట మాట్లాడుతున్నారనే టాక్ ఎందుకు వచ్చింది? అసలేం జరిగింది? అంటే.. ఇటీవల టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తన కుటుంబంతో కలిసి.. ప్రధాని మోదీని కలిశారు. దాదాపు అర్థగంటకు పైగా వీరి భేటీ జరిగింది. ఈ భేటీలో జరిగిన విషయాలను కనకమేడల మీడియాకు వివరించారు. ఏపీలో జరుగుతున్న అన్యాయాలను మోదీ దృష్టికి ఆయన తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారట. ఏపీ పంజాబ్‌ల మారిందని ఆవేదన వ్యక్తం చేశారట. శాంతి భద్రతలు రోజురోజుకీ క్షీణించిపోతున్నాయని.. అసలు అక్కడ ఏం జరుగుతోందో ప్రతిదీ తనకు తెలుసని ప్రధాని అన్నారని కనకమేడల మీడియాకు వివరించారు. మరి ఇన్ని తెలిసిన మోదీ.. జగన్ వచ్చినప్పుడు ఈ విషయాలేవీ ఎందుకు చర్చించడం లేదు? ఇదంతా ఏంటని ఏకంగా జగన్‌నే నిలదీయవచ్చు కదా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏపీకి అప్పు ఇచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని ఇవ్వాలని లేకుంటే జరగాల్సిన నష్టం జరిగిపోతుందని ఆపై ఎవరూ కాపాడలేరని కాగ్ కుండలు బద్దలు కొట్టింది. అవేం పట్టనట్టుగానే కేంద్రం వ్యవహరిస్తోంది.

పంజాబ్‌లో ఏం జరుగుతోంది?

ప్రధాని మోదీ.. ఏపీని పంజాబ్‌తో పోల్చారు. పంజాబ్‌లో మాదిరిగా శాంతి భద్రతలు రోజురోజుకీ క్షీణించిపోతున్నాయని అన్నారట. అసలు అక్కడేం జరుగుతోంది? ఆప్ అధికారంలోకి వచ్చాక డ్రగ్స్, రౌడీగ్యాంగులు రెచ్చిపోతున్నాయనేది ప్రధాన ఆరోపణ. ఇక అప్పుల విషయంలో వెనకాడేదే లే.. అందిన కాడికి అప్పులు చేస్తోంది. మరోవైపు ఖలిస్తాన్ ఉద్యమం పేరుతో అమృత్ పాల్ సింగ్ వ్యవహారం దేశంలో సంచలనంగా మారింది. ఇది చాలదన్నట్టు సింగర్ మూసేవాలా హత్య. మొత్తానికి పంజాబ్ రావణకాష్టంలా మారింది. అయినా సరే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. పైగా పంజాబ్ సర్కారుపై ప్రశంసలు కురిపించడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక్కడ ఎలాంటి పరిస్థితులైతే ఉన్నాయో ఏపీలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయనడం ఆశ్చర్యానికి గురి చేసింది. సడెన్‌గా మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో జగన్ కూడా డైలమాలో పడిపోయారట. ఏపీలో నిజంగా ఏం జరుగుతోందనే దానిపై ఓ నివేదికను అందజేయాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మోదీ వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి.

వైసీపీ – బీజేపీ మధ్య స్నేహం ఉందా?

ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడైతే ఏపీలో పరిస్థితులు మారాయి. వైసీపీకి కొంత ఎదురు గాలి అయితే వీస్తోందని ఎమ్మెల్సీ ఎన్నికలతోనే తేట తెల్లమైంది. ఈ విషయాలన్నీ ప్రధాని మోదీకి తెలియకుండానే ఉంటాయా? ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తుందా? రాదా? అనే సందేహం కూడా కేంద్రానికి వచ్చి ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇంతకు ముందులా వైసీపీ – బీజేపీ మధ్య స్నేహం లేదని ఏపీలో చర్చ నడుస్తోంది. అవసరమున్నంత వరకే కదా.. ఎవరైనా పక్కన పెట్టుకుంటారు.. అవసరం తీరిపోయిందా? అంతే సంగతులు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఇది పక్కా అమల్లో ఉంటుంది. ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టే మోదీకి వైసీపీపై మొహం మొత్తిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే పక్కన పెట్టేశారంటున్నారు. వైసీపీ నేతలు మాత్రం ఈ విషయంపై సైలెంట్ అయ్యారు. మొత్తానికి మోదీ మున్ముందు ఎలా వ్యవహరిస్తారు? జగన్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? అనేది ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago