Mohan Babu: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినీ ప్రస్థానం గురించి మనకు తెలిసిందే. సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో అంచలంచలగా ఎదుగుతూ వచ్చారు. ఇలా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా విలక్షణ నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మోహన్ బాబు మరోవైపు విద్యాసంస్థలను కూడా ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇకపోతే మార్చి 19వ తేదీ మోహన్ బాబు తన 71వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా మోహన్ బాబు తన సినీ రాజకీయ ప్రస్థానం గురించి పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా విలేఖరి మోహన్ బాబును ప్రశ్నిస్తూ..ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత మీకు ఏ విషయంలో రాజకీయాలపై విరక్తి కలిగించేలా చేసిందని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ…
ప్రస్తుతం అదంతా ఆ ప్రస్తుతం… గతం గతః జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ నేను కూర్చోలేను నన్ను రాజకీయాలలో మోసం చేశారు. అయితే నన్ను వాళ్లు మోసం చేశారు వీళ్ళు మోసం చేశారని నేను చెప్పను. ఇక అన్నయ్య ఎన్టీఆర్ నన్ను ఆ కాలంలోనే రాజకీయాలలోకి రమ్మన్నారు. అయితే నేను ముక్కుసూటితనంగా వ్యవహరించే తీరు రాజకీయాలకు పనికిరాదని నేనే వెనక్కి తగ్గాను.
రాజకీయాలలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని చిత్తు చేయాలి. అప్పుడే మనం రాజకీయాలలో ముందుకు పోగలం లేదంటే రాజకీయ సన్యాసం తప్పనిసరి. ఇక ఈ రాజకీయాలలో అందరూ ఇమడలేరు. అందుకే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని,తనని ఎవరు రాజకీయాలలో వెనక్కి లాగలేదంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు రాజకీయాల గురించి చూసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…